Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్( helicopter) కొనుగోలుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ కోసం రూ.176 కోట్లతో కొనుగోలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. విపరీతంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. దీనిపై స్పష్టతనిచ్చింది. కొద్ది రోజుల కిందట హెలిక్యాప్టర్ పరిస్థితిపై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అదే పనిగా ప్రచారం ప్రారంభం అయింది. కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా దీనిని ప్రచారం చేస్తోంది. దీంతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది.
* సామర్థ్యం పరిశీలనకు కమిటీ..
రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy) ప్రమాదం తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు హెలికాప్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. అందులో భాగంగా సీఎం చంద్రబాబుతో పాటు ప్రముఖుల కోసం వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ సామర్థ్యం పై నివేదిక ఇవ్వాలంటూ కమిటీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొత్త హెలికాప్టర్ కొనుగోలులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అప్పులు పుట్టడం లేదన్న సీఎం చంద్రబాబు రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలిక్యాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
Also Read: Jana Sena : జనసేన రాజ్యసభ పదవి ఆయనకే!
* సోషల్ మీడియాలో వైరల్..
మరోవైపు సోషల్ మీడియాలో( social media)..’ కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం. సీఎంతో పాటు ఇతరులు వినియోగించేందుకు కొత్త హెలికాప్టర్. ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు. జిఏడి పొలిటికల్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల కమిటీ. ప్రస్తుత హెలికాప్టర్ పనితీరు. కొత్త హెలికాప్టర్ మోడల్ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం. హెలికాప్టర్ కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కమిటీని నియామకం ‘ అంటూ ప్రచారం నడుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడం.. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో సర్కార్ స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ ను రంగంలోకి దించింది.
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత.. పీటీ వారెంట్ తో పోలీసులు రెడీ!
* ఉత్త ప్రచారమే..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్( fact check) సమగ్ర విచారణ చేసింది. కొత్త హెలికాప్టర్ కొనుగోలు అంశంపై స్పష్టతనిచ్చింది. రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గార్ల కోసం విలాసవంతమైన హెలికాప్టర్ ను ప్రభుత్వం కొంటున్నట్లు కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి అంటూ ప్రత్యేక ప్రకటన చేసింది. అదంతా అబద్ధం అని తేల్చేసింది. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై చేస్తున్న ఫేక్ ప్రచారం అంటూ ట్వీట్ చేసింది. ఆ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలపై ఇట్టే స్పందిస్తోంది.
జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. అప్పులు పుట్టడం లేదన్న @ncbn రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు.#CBNFailedCM#SadistChandraBabu… pic.twitter.com/Vk9YBtHOtw
— YSR Congress Party (@YSRCParty) May 15, 2025