https://oktelugu.com/

Nellore: డ్రగ్స్ పార్టీలో దొరికిన నెల్లూరు వైసీపీ నేత కుమారుడు

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు పట్టుబడిన యువకుల్లో ఉన్నాడు. ద్వారకానాథ్ పేరుపై ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 19, 2023 / 10:30 AM IST

    Nellore

    Follow us on

    Nellore: దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల మూలాలు ఏపీ వైపు చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాదులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ పార్టీ చేసుకున్న నెల్లూరు యువకులు పట్టుబట్టడం విశేషం.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎంతటి వారైనా విడిచి పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని ఎస్సార్ నగర్ లోని అపార్ట్మెంట్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడి చేశారు. అయితే పట్టుబడిన యువకులు నెల్లూరు జిల్లాకు చెందినవారు. అందులో ఓ యువకుడు వైసీపీ కీలక నాయకుడి కుమారుడు కావడం విశేషం.

    నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు పట్టుబడిన యువకుల్లో ఉన్నాడు. ద్వారకానాథ్ పేరుపై ఉన్న కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబర్ ప్లేట్ పై నుడా చైర్మన్ అనే స్టిక్కర్ ఉంది. ప్రేమ్చంద్ అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలకు గాను గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. దాదాపు 30 మంది వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా అధికారులు దాడులు చేశారు.

    ఈ మధ్యన నెల్లూరు రాజకీయాలు సీఎం జగన్ కు చికాకు పెడుతున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. మిగతాఎమ్మెల్యేలు,కీలక నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయనపై హై కమాండ్ పెద్దలు కొందరు వ్యూహాత్మకంగా స్థానిక ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి మంచి ఫలితాలను అందించింది. ఈసారి మాత్రం ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ఇటువంటి సమయంలోనే వైసీపీ నేత కుమారుడు డ్రగ్స్ తో దొరకడం కలకలం సృష్టిస్తోంది. ప్రత్యర్థులకు ఇదో ప్రచారస్త్రంగా మారనుంది.