Nellore VR Government School: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలు( Government schools) అంటేనే ఒక రకమైన అపవాదు ఉంది. అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. శిక్షణ తీసుకుని ఉత్తమ విద్యా బోధన చేస్తారు. అయినా సరే ప్రైవేటు విద్య వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని ఒక నమ్మకం. ఆపై ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో వసతులు ఉండవని.. పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమేనని ఎక్కువమంది నమ్ముతుంటారు. అందుకే తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చుతుంటారు. ఈ ప్రభావం ప్రభుత్వ పాఠశాలల మనుగడపై చూపింది. చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి వచ్చింది పరిస్థితి. ఇటువంటి సమయంలో చాలావరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రుల ఆదరణ పొందుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే అడ్మిషన్లు కూడా దొరకడం లేదు. దీంతో రాజకీయ సిఫార్సులు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అటువంటిదే నెల్లూరు వి ఆర్ హై స్కూల్. అక్కడ అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్. ఈ తరుణంలో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు పెట్టారంటే ఏ స్థాయిలో అక్కడ చేరికలకు డిమాండ్ అనేది ఇట్టే తెలిసిపోతుంది.
Also Read: AP School Bus Green Tax: బోధన బలోపేతానికి కొత్త అడుగు: స్కూల్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేత!
గత ప్రభుత్వ చర్యలతో మూత.. నెల్లూరులో( Nellore ) ఉన్న వి ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గత ప్రభుత్వ చర్యల పుణ్యమా అని పూర్తిగా మూత పడింది. అక్కడ చదువుకున్న విద్యార్థులు వేరువేరు పాఠశాలల్లో చేరిపోయారు. ఇటువంటి క్రమంలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ పాఠశాల స్వరూపమే మారిపోయింది. ఉత్తమ విద్యా బోధనతో పాటు అన్ని రకాల వసతులు సమకూరడంతో ఇక్కడ అడ్మిషన్లకు విపరీతమైన డిమాండ్. ప్రస్తుతం పాఠశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. పాఠశాల నిబంధనల మేరకు అడ్మిషన్లు లేవని ఉపాధ్యాయులు చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ పాఠశాలల్లో వచ్చిన మార్పును చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: School Holidays List In AP: ఏపీలో ఈ ఏడాది సెలవులే సెలవులు
మంత్రి నారాయణ చొరవతో..
నెల్లూరు శాసనసభ్యుడిగా పొంగూరు నారాయణ( Minister Narayana) గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఏపీ క్యాబినెట్లో మంత్రిగా కూడా ఎంపికయ్యారు. మంత్రిగా ఈ స్కూలు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించారు. రూ.15 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పూర్తిగా పాఠశాలను చూడముచ్చటగా మార్చేశారు. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చారు. ఈ పాఠశాలలో వసతులు చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను చర్చేందుకు పోటీపడ్డారు. అందుకే ఇప్పుడు సీట్లు ఖాళీ లేవని పాఠశాల ఎదుట బోర్డు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈనెల 23 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీతో తరగతి గదులు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక హంగులతో ఆటస్థలం సైతం ఉంది. పాఠశాల ప్రాంగణమంతా పచ్చని తివాచీ పరిచినట్టు ఉంటుంది. ఇక్కడి పాఠశాలను చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి కాగా.. వందలాదిమంది నిరాశతో వెనుదిరిగినట్లు అక్కడ సిబ్బంది చెబుతున్నారు.