Nellore Aruna Viral News: నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరుణ సాగించిన అరాచకాలు మామూలువికావు. అప్పటి అధికార పార్టీ అండతో ఆమె చెలరేగిపోయింది. ఏకంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ ను తన పలుకబడి ఉపయోగించి ఆమె జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఏకంగా సెక్రటేరియట్ లెవెల్ లోనే తన పలుకుబడి ఉపయోగించుకుంది. శ్రీకాంత్ బయటికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె రాసలీలలు కూడా సాగించింది. దానికి సంబంధించిన వీడియోలు మీడియాలో విపరీతంగా సర్కులేట్లో ఉన్నాయి. ఒక ఏఎస్పి స్థాయి అధికారులతో ఆమె ఏకంగా ఐ లవ్ యు కూడా చెప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాంత్ పేరుతో ఆమె నెల్లూరులో ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సైన్యం ద్వారా సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేపట్టినట్టు సమాచారం. కిందిస్థాయి పోలీస్ అధికారులకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించే స్థాయికి ఆమె తన రేంజ్ పెంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె దిశ యాప్ విపరీతంగా వాడుకుంది. “దిశ” కోసం ప్రయోజన కర్తగా తనను తాను ప్రమోట్ చేసుకుంది. పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం.. వారికి సంబంధించిన సీక్రెట్ వీడియోలను బయటపెట్టి తన పనులు చేయించుకోవడం వంటి వాటిని అరుణ దర్జాగా కొనసాగించింది. అరుణ ఈ స్థాయికి రాత్రికి రాత్రే ఎదగలేదు. గడచిన ఐదు సంవత్సరాలలోనే ఆమె తన స్థాయిని అంతకుమించి పెంచుకుంది.
Also Read: ఆ రెండు కుటుంబాలపై దువ్వాడ ‘కులం’ కార్డు!
అరుణకు గతంలోని వివాహం జరిగింది. అయితే ఈమె పోకడలు చూసి భర్త అడ్డు చెప్పాడు. భర్త తనకు అడ్డుగా ఉండడంతో.. అతడిని భూమి మీద లేకుండా చేసింది. తనకు అడ్డుగా లేకుండా చూసుకుంది.. ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది.. ఏకంగా తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. శ్రీకాంత్ తో పరిచయం పెంచుకొని..తన వ్యవహారాలను కొత్త రూపు దాల్చుకునేలా చేసింది. అయితే అరుణకు సంబంధించి వ్యవహారాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆమె గతంలో ఉన్న తీరుకు.. ఇప్పటి తీరుకు ప్రస్తావిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ కనిపిస్తోంది. ఆ ఫోటోను చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోటోలో అరుణ 2014 – 15 కాలంలో బ్లాక్ అండ్ వైట్ రూపంలో కనిపిస్తుంటే.. ఇప్పటికాలానికి ఆల్ట్రా మోడ్రన్ గా తయారైందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.