https://oktelugu.com/

Delhi Cm Oath Ceremony: సరదాగా కుశల ప్రశ్నలు.. ఢిల్లీలో చంద్రబాబు, పవన్ లకు నరేంద్రమోడీ పెద్దపీట.. వైరల్ అవుతున్న వీడియో!

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) వేదిక మీదకు రాగానే అందరినీ పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు. మధ్యలో పవన్ కళ్యాణ్ వద్ద ఆగి కాసేపు అతనితో ముచ్చటించారు. అనంతరం చివర్లో అమిత్ షా పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు తో కూడా ఆయన కాసేపు ముచ్చటించారు.

Written By: , Updated On : February 20, 2025 / 02:03 PM IST
Delhi Cm Oath Ceremony

Delhi Cm Oath Ceremony

Follow us on

Delhi Cm Oath Ceremony: నేడు ఢిల్లీ లో ముఖ్యమంత్రిగా రేఖ గుప్త(Delhi Cm Rekha Gupta) ప్రమాణస్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అన్ని రాష్ట్రాలనుండి ఎన్డీయే కూటమి కి చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మన ఆంధ్ర ప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) లతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణ దేవరాయలు వంటి వారు కూడా హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ లో పలు మన ఆంధ్ర ప్రదేశ్ కి రావాల్సిన పలు ప్రాజెక్ట్స్ గురించి చర్చించారు. అనంతరం ప్రమాణ స్వీకార కాయక్రమానికి వెళ్లారు. అక్కడ ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) వేదిక మీదకు రాగానే అందరినీ పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు. మధ్యలో పవన్ కళ్యాణ్ వద్ద ఆగి కాసేపు అతనితో ముచ్చటించారు. అనంతరం చివర్లో అమిత్ షా పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు తో కూడా ఆయన కాసేపు ముచ్చటించారు. ఎన్డీయే నేతలు, బీజేపీ పార్టీ ముఖ్య నేతలు అంత మంది వేదిక మీద ఉన్నప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో ప్రత్యేకంగా మంతనాలు జరపడం హైలైట్ గా నిల్చింది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన అభిమానులు షేర్ చేస్తూ బాగా వైరల్ చేసారు. కేంద్రంలో అతి కష్టసమయంలో టీడీపీ, జనసేన మద్దత్తు కారణంగా, అధికారం లోకి వచ్చాము అనే విశ్వాసం తో ప్రధాని మోడీ, బీజేపీ పెద్దలు వీళ్ళిద్దరికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చి, ఆంధ్ర ప్రదేశ్ కి భారీగా నిధులు కూడా మంజూరు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఇకపోతే సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ లో పలువురు కీలకమైన మంత్రులతో చర్చలు జరపనున్నారు. మిర్చి రైతుల విషయం లో ఉన్న సమస్యని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు ఆయన భేటీ ఉండనుంది. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన పలు నిధులు గురించి కూడా ఆయన చర్చలు జరపనున్నారు. ఈ నెల 24న ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా ఈ భేటీ తర్వాత పలు కీలకమైన శాఖలకు ప్రాధాన్యత ఇవ్వడం పై ఒక కొలిక్కి రానుంది. అందుకే నిన్న జరగాల్సిన క్యాబినెట్ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల నాడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి పలు కీలకమైన జీవోలు పాస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.