https://oktelugu.com/

Urfi Javed : ఉర్ఫీ జావేద్ అలా ఎందుకు తయారవుతుంది.. వాళ్ల అమ్మ స్పందనేంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చాలా మంది నటీమణులు సైతం స్టార్లు గా వెలుగొందుతున్నారు. ఇండస్ట్రీ లో వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకుంటే చాలు ప్రతి ఒక్కరూ స్టార్ ఇమేజ్ ను పొందవచ్చు...

Written By: , Updated On : February 20, 2025 / 01:57 PM IST
Urfi Javed

Urfi Javed

Follow us on

Urfi Javed : ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలామంది నటీమణులు రాణించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే ఉర్ఫీ జావేద్ షోలతో సందడి చేస్తుంది. స్కిన్ షో తో పాటుగా ఎక్స్ పోజ్ చేసి ఫోటోలతో ఫోటో షూట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక మొదట్లో ఈమె మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికి చాలామంది సెలబ్రిటీలు సైతం తన ఆత్మవిశ్వాసాన్ని పొగుడుతున్నారు.ఇక ఉర్ఫీ జావేద్ తల్లి అయిన జకీయా జియో హాట్ స్టార్ షో ‘జనరేషన్ ఆజ్ కల్’ షో లో ఉర్ఫీ జావేద్ తల్లి జకీయా మాట్లాడుతూ మాటలు ప్రోమో లో వచ్చి హల్చల్ చేస్తున్నాయి… ఆమె మాట్లాడుతూ నా కూతురు ఫ్యాషన్ ఫోటో షూట్ చూసి ముందుగా షాక్ అయ్యాను…కానీ తనమీద తనుకున్న కాన్ఫిడెంట్ చూసి ఆశ్చర్యపోయాను… అలాంటప్పుడు ఆమెను ఎవ్వరూ ఏమనుకున్నా పర్లేదు… ఆమె ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగుతుంది కాబట్టి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మొత్తం ఆమెకి తెలుసు అంటూ తన కూతురికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది…ఇక ఇదిలా ఉంటే ఉర్ఫీ జావేద్ జియో హాట్ స్టార్ లో వస్తున్న ‘ఎంగేజెడ్ రోకా విత్ దోకా’ లో నటిస్తున్నారు. ఈ షో ని హర్ష్ గుజ్రాల్ తో కలిసి ఉర్ఫీ హోస్ట్ చేస్తున్నారు. ఇక మరికొన్ని వెబ్ సీరీస్ లలో కూడా ఆమె నటిస్తుంది…అలాగే తొందర్లోనే ఒక పెద్ద సినిమాలో కూడా ఆమె ఒక మంచి పాత్రలో నటించబోతుందనేది కూడా తెలుస్తుంది…

ఒకప్పుడు ఆర్టిస్టులు ఫోటోలు పట్టుకొని ఆఫీస్ లా చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు మాత్రం వీడియో ఫోటో షూట్ లతో పాపులారిటిని సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నారు. అందుకే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రతి చోట పాత వాళ్ళు పోయి కొత్తవాళ్ళు వస్తుండటం జరుగుతూనే ఉంటుంది… ఇక ఉర్ఫీ జావేద్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది…మరి తెలుగు సినిమాల్లో కూడా ఆమె చేత నటింపజేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఫ్యూచర్ లో ఈవిడ కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచం లో ఎవరు ఏ రోజు స్టార్లుగా మారుతున్నారు అనేది తెలియడం లేదు…అందంగా ఉంటే చాలు పూసలు అమ్ముకునే లేడీ అయిన కూడా హీరోయిన్ అవ్వచ్చు…ఇక మొత్తానికైతే ఉర్ఫీ జావేద్ ను తీసుకోవడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపిస్తున్నారు…

Urfi Javed