Nara Lokesh : నారా లోకేష్ పై కీలక బాధ్యతలు పెట్టారు చంద్రబాబు. పార్టీలో ఇప్పుడు లోకేష్ ప్రాధాన్యత పెరిగింది. అటు ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఉన్నవేళ లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తనపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున వీలైనంతవరకు.. కూటమి పార్టీలతో సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులు సైతం సమన్వయం చేసుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి పెద్దలను కూడా కలిశారు. అయితే ఇదంతా పక్క వ్యూహంతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంపై చర్చించడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటిని చర్చించేందుకే లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నామినేటెడ్ పదవుల విషయంలో లోకేష్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఇటు రాష్ట్రంలో జనసేనతో, అటు జాతీయస్థాయిలో ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
* సుదీర్ఘ పాదయాత్ర
టిడిపి విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అప్పట్లో వైసీపీ దూకుడు మీద ఉండేది. టిడిపి శ్రేణులు పై దాడులు కేసులు కొనసాగేవి. పార్టీ నాయకులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకున్నారు లోకేష్. పాదయాత్రకు సైతం అప్పటి వైసిపి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఆ సమయంలో చాలామంది టీడీపీ నేతలు దూకుడుగా వ్యవహరించారు. కేసులను ఎదుర్కొన్నారు. అయితే దారి పొడవునా టిడిపి నేతల పోరాటాలను, వారిపై ఉన్న కేసులను తెలుసుకున్నారు లోకేష్.
* ఆశావహులు అధికం
ఇటీవల చంద్రబాబు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. 20 కార్పొరేషన్లకు సంబంధించి అధ్యక్షులను నియమించారు. జనసేన తో పాటు బిజెపికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే పార్టీలో ఇంకా ఆశవాహులు అధికంగా ఉన్నారు. దీంతో చంద్రబాబుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నా నేతలు వినతులు ఇస్తున్నారు. దీంతో ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఇప్పటికే పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కూటమితో సమన్వయం చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నామినేటెడ్ పదవుల వ్యవహారాన్ని లోకేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
* పార్టీలో పెరిగిన పట్టు
టిడిపిలో లోకేష్ కు పట్టు పెరిగింది. సీనియర్లతో సైతం ఆయన చనువుగా ఉంటున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో జనసేనతో పాటు బిజెపితో కూడాసమన్వయంతో కొనసాగుతున్నారు. పొత్తు అనేది సుదీర్ఘకాలం కొనసాగాలని భావిస్తున్న నేపథ్యంలో లోకేష్ సైతం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీకి న్యాయం చేయడంతో పాటు మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, జనసేనతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరగా ఎటువంటి అరమరికలు లేకుండా నామినేటెడ్ పదవుల పందారం పూర్తి చేయాలన్న ఆలోచనతో లోకేష్ ఉన్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Nara lokesh will be given key responsibilities in the party chandrababus sensational decision
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com