Nara Lokesh emotional tweet: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) ఓ పేదవాడి విషయంలో స్పందించారు. త్వరలో వచ్చి కలుస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇటీవల తెలంగాణలో మేడారం మహా జాతర జరిగింది. కోవా బన్ బండి పెట్టుకొని బతుకుతున్న వలి అనే చిరు వ్యాపారి విషయంలో యూట్యూబర్లు అతిగా స్పందించారు. తమ రీల్స్, లైకుల కోసం అతనిని చాలా బాధించారు. పది రూపాయలకు బన్నే రాదు.. కోవా ఎలా ఇస్తున్నావ్? ఏం కలిపి తయారుచేసావు? ఈ బన్ లు ఎందుకు అంతలా ఉబ్బిపోయాయి? అసలు అవి తినడానికి పనికి వస్తాయా? భక్తుల ప్రాణాలతో ఆటలాడుతున్నావా అంటూ దాడి కూడా చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దీనిపై స్పందించారు మంత్రి నారా లోకేష్.
వలి అనే చిరు వ్యాపారిపై దాడి తెలంగాణలో( Telangana) మేడారంలో పెద్ద జాతర జరుగుతుంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతం కావడంతో చాలామంది యూట్యూబర్లు, రీల్స్ చేసేవారు వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వలి అనే చిరు వ్యాపారి కోవా బన్ ల పై లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆ బన్నులను బలవంతంగా అతని చేత తినిపించి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజెన్లు రకరకాలుగా స్పందించారు. ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలతో భక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం.. ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెట్టడం సరికాదని కొంతమంది వ్యాఖ్యానించారు. అయితే పొట్టకూటి కోసం వచ్చిన చిరు వ్యాపారిపై మీ రీల్స్, లైక్స్ కోసం మతం పేరుతో అవమానిస్తారా? ఇది హేయమైన చర్య అంటూ వ్యాఖ్యానించిన వారు కూడా ఉన్నారు.
ఎమోషనల్ ట్వీట్..
అయితే ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. డియర్ బ్రదర్ వలి. నీకు జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను. మతం ప్రాతిపదికగా కొందరు ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగువారిలో ఇలాంటి మత వివక్షకు చోటు లేదు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. పరస్పరం గౌరవించుకుంటారు. త్వరలోనే నేను వచ్చి నీ కోవా బన్ రుచి చూడాలనుకుంటున్నాను.. అని ట్విట్ చేశారు. ఒక పేద వ్యాపారిపై ఈ విధంగా ప్రవర్తించారు. కానీ తిరుమలలో లడ్డు కల్తీ పై ఇంటర్వ్యూలు, వీల్స్ చేసే సాహసం మాత్రం చేయలేకపోతున్నారు.
Dear Brother Vali, I am deeply sorry that you had to endure this. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect, and brotherhood. I will meet you soon and look forward to tasting your famous Khoya bun!… https://t.co/AvckML9odY
— Lokesh Nara (@naralokesh) February 15, 2026