Nara Lokesh vs DK Shivakumar: విశాఖకు( Visakhapatnam) పెట్టుబడుల వరద వస్తోంది. ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇది నిజంగా శుభ పరిణామం. 87 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతున్నారు. అనతికాలంలోనే లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మంత్రి లోకేష్ చొరవతోనే ఇది సాధ్యమైందని స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు. లోకేష్ సైతం ఈ డేటా సెంటర్ రాక వెనుక జరిగిన పరిణామాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతోనే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. గూగుల్ డేటా సెంటర్ రావడానికి కొన్ని రకాల మినహాయింపులు కూడా ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీని మార్చినట్లు తెలిపారు. ఈ పాలసీ మార్పుతోనే గూగుల్ సంస్థకు కొన్ని రకాల మినహాయింపులు లభించడంతో ఏపీకి వచ్చినట్లు వివరించారు లోకేష్. అయితే దేశంలో మిగతా రాష్ట్రాలు గూగుల్ కోసం ప్రయత్నాలు చేశాయి. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. దీనిపై బలమైన చర్చ నడుస్తోంది దేశవ్యాప్తంగా..
మారిన కర్ణాటక వైఖరి..
గత కొద్దిరోజులుగా కర్ణాటక( Karnataka) ప్రభుత్వ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. మొన్న ఆ మధ్యన ఓ కంపెనీ సీఈఓ ట్విట్ చేశారు. బెంగళూరులో రహదారులు బాగాలేదని… ఐటీ సంస్థలు నిర్వహించడం కష్టమని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విశాఖలో అన్ని రకాల వసతులు ఉన్నాయని.. ఐటీ సంస్థలు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై స్పందించారు. పోతే పొండి అన్నట్టు మాట్లాడారు. అటు తరువాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే కుమారుడు ప్రియాంక ఖర్గే ఏపీకి సంబంధించిన ప్రతి అంశానికి స్పందిస్తున్నారు. దానిపై మంత్రి లోకేష్ ధీటుగానే కౌంటర్ ఇస్తున్నారు.
బయటపెట్టిన కర్ణాటక మంత్రి..
తాజాగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్( Google data centre) ఏర్పాటుకు సంబంధించి దేశవ్యాప్తంగా బలంగా చర్చ నడుస్తోంది. పెద్ద రాష్ట్రాలు ప్రయత్నిస్తున్న క్రమంలో ప్రతిష్టాత్మక ఈ సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టడం ఏంటనేది వారి అనుమానం. అయితే దానిపై స్పందించారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే. గూగుల్ డేటా సెంటర్ కు ఏపీ ప్రభుత్వం ఎన్నో రకాల రాయితీలు కల్పించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా 100% జిఎస్టి రాయితీ ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ట్రాన్స్మిషన్లకు సంబంధించి పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్కు అవసరమైన భూమిని కూడా తక్కువ ధరకు అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం డేటా సెంటర్ పాలసీని మార్చి ఏపీకి సహకరించిందని చెప్పారు. అందుకే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్లు వివరించారు కర్ణాటక మంత్రి. దీనిపై కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి లోకేష్. ఆంధ్ర ఫుడ్ స్పైసీ అని.. ఇక్కడ పెట్టుబడులు కూడా స్పైసీగా ఉంటాయని ట్వీట్ చేశారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే ఎక్కడో కాలుతోందని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి అయితే కర్ణాటక ప్రభుత్వానికి లోకేష్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు.