Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: తెలంగాణ నుండి గెంటేశారు: మోడీ ముందు చరిత్రతవ్విన నారా లోకేష్

Nara Lokesh: తెలంగాణ నుండి గెంటేశారు: మోడీ ముందు చరిత్రతవ్విన నారా లోకేష్

Nara Lokesh: సరికొత్త అధ్యయనం ఆవిష్కృతం అయ్యేందుకు సమయం ఆసన్నం అయ్యింది. అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది క్షణాల్లో శంకుస్థాపన చేయనున్నారు. అంతకంటే ముందే ఎంపిక చేసిన ప్రజాప్రతినిధుల ప్రసంగం ఉండనుంది. అందులో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. అమరావతి నమో నమః అంటూ లోకేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఒక్క పాక్ కాదు.. 100 పాక్ లు వచ్చినా భారతదేశం గడ్డమీద మొలిచిన గడ్డిని కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 పాకిస్తాన్ లను ఎదుర్కొనే భారత్ ఏకైక మిస్సైల్ మన నమో అంటూ నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. లోకేష్ ప్రసంగం ఆధ్యాంతం ఆకట్టుకుంది.

Also Read: దేశభద్రతకు ఏపీ మార్గదర్శి..గుల్లలమోదలో క్షిపణి కేంద్రం!

* బలవంతంగా పంపించారు..
మరోవైపు లోకేష్( Nara Lokesh) రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. నాటి తేనె తుట్టను కదిపారు. అన్యాయంగా నాడు తెలంగాణ రాష్ట్రం నుంచి గెంటివేసారని చెప్పుకొచ్చారు. రాజధాని లేని రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టే ప్రయత్నం చేశారని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారం మరువరానిదని చెప్పుకొచ్చారు.

* అమరావతి అన్ స్టాపబుల్
ప్రధాని నరేంద్ర మోడీకి( Prime Minister Narendra Modi) అమరావతి అంటే చాలా ఇష్టం అని నారాల్లో కేసు తెలిపారు. అందుకే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారని గుర్తు చేశారు. అమరావతికి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారని సంతృప్తి ప్రకటించారు. నేడు అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రారంభించిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని తేల్చి చెప్పారు నారా లోకేష్. ఇక అమరావతి అన్ స్టాపబుల్ అని.. ఇకనుంచి పనులు జట్ స్పీడుతో సాగుతాయని చెప్పారు. అంతకుముందు రాజధాని పునర్నిర్మాణ సభా వేదిక మీదకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సన్మానించారు. ధర్మవరం శాలువా కప్పి సత్కరించారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్ఞాపికలను అందజేశారు.

* ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం
ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు( Gannavaram airport) చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత సాదరంగా ఆహ్వానించారు. అక్కడ నుంచి ర్యాలీగా రోడ్డు మార్గం గుండా ప్రధాని కాన్వాయ్ ముందుకు సాగింది. వెలగపూడి వద్ద ప్రధాని మోదీని గవర్నర్ తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. సభా ప్రాంగణానికి దగ్గరుండి తీసుకువెళ్లారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version