Nara Lokesh
Nara Lokesh : ఓ మహిళ అవయవ దానం చేసింది. మరొకరి ప్రాణాన్ని నిలబెట్టింది. అందుకు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) త్వరలో కూడా తోడైంది. దీంతో విజయవంతంగా అవయవాల తరలింపు పూర్తయింది. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్ అయింది. ఆసుపత్రి వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు ఆమె అవయవ దానానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రిలో వైద్యులు మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. వెంటనే మంత్రి లోకేష్ స్పందించారు.
Also Read : వైసిపి నేతతో చేతులు కలిపిన లోకేష్.. తెలుగు తమ్ముళ్లు ఫైర్!
* సొంత ఖర్చులతో విమానం ఏర్పాటు
ఇటీవల అవయవ దానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే ఈ మహిళ అవయవాలను తరలించేందుకు రవాణా ఖర్చులను లోకేష్ సొంతంగా పెట్టుకోవడం విశేషం. ప్రత్యేక విమాన( special flight) ఖర్చులు లోకేష్ భరించారు. బ్రెయిన్ డెడ్ అయినా మహిళా గుండెను తిరుపతిలోని ఆసుపత్రి చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను తరలించారు. తొలుత గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు.. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆసుపత్రికి తరలించారు.
* లోకేష్ కు అభినందనలు..
అయితే ఈ విషయంలో మంత్రి లోకేష్ చొరవ అభినందనలు అందుకుంటుంది. విషయం తెలియగానే లోకేష్ శరవేగంగా స్పందించారు. బ్రెయిన్ డెడ్ ( brain dead)అయిన సుష్మను కొద్దిరోజుల కిందటే ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. అయితే ఆమె శరీరం వైద్యానికి సహకరించలేదు. ఆపై బ్రెయిన్ డెడ్ అవడంతో కోమాలోకి వెళ్లిపోయారు. వెంటనే అక్కడున్న వైద్యులు ఆమె భర్త శ్రీనివాస్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అవయవ దానం గురించి వివరించారు. ఆయన అంగీకరించడంతో ఆసుపత్రి యాజమాన్యం మంత్రి నారా లోకేష్ సహకారం తీసుకుంది. అయితే ప్రత్యేక విమానాన్ని సొంత ఖర్చులకు ఏర్పాటుచేసిన లోకేష్ ను పలువురు అభినందిస్తున్నారు.
* అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు పెంచాలని ప్రభుత్వం( AP government ) భావిస్తోంది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో లోకేష్ చొరవ తీసుకున్నారు. ఈ ఘటన ప్రేరణతో ప్రభుత్వం దృష్టికి అవయవ దానం అంశం వెళ్లినట్లు సమాచారం. అవయవ దానం పెరిగే విధంగా ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్నాయి. దీనికి ప్రభుత్వ సహకారం తోడైతే ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది.
Also Read : చేతిలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో లోకేష్ కు తెలుసు*