Nara Lokesh : మహానాడులో( mahanadu ) కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారా? నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయనున్నారా? పార్టీ పగ్గాలు అందించనున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈనెల 27, 28,29 తేదీల్లో కడప లో మహానాడు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో దూకుడు మీద ఉన్న టిడిపి.. పార్టీ పండుగను ఘనంగా జరుపుకోవాలని భావిస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మహానాడు వేదికలు చాలా అయ్యాయి. కానీ తొలిసారిగా జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో నిర్వహిస్తున్నారు. దీంతో మహానాడు పై చాలా రకాల అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు 75వ వసంతంలోకి రావడంతో పార్టీ పగ్గాలు లోకేష్ కు అందించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
Also Read : తెలంగాణ నుండి గెంటేశారు: మోడీ ముందు చరిత్రతవ్విన నారా లోకేష్
* పదోన్నతి కల్పించాలని డిమాండ్..
కూటమి ప్రభుత్వంతో పాటు టిడిపిలో నారా లోకేష్ ను( Nara Lokesh) ప్రమోట్ చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. మొన్న ఆ మధ్యన లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని పార్టీ శ్రేణులు కోరాయి. దీనిపై జనసేన నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. రెండు పార్టీల మధ్య గందరగోళం నడిచింది. ఈ తరుణంలో ఇరు పార్టీల నాయకత్వాలు ప్రత్యేక ప్రకటనలు చేశాయి. ఇకనుంచి బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ శ్రేణులను ఆదేశించాయి. దీంతో డిప్యూటీ సీఎం అనే అంశము మరుగున పడింది. ఈ తరుణంలోనే లోకేష్ కు తెలుగుదేశం పార్టీలో పదోన్నతి కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
* టిడిపి అధ్యక్షుడిగా..
ప్రస్తుతం చంద్రబాబు( CM Chandrababu) జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రానికి అధ్యక్షుడిగా వేరే నేత కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ కు పదోన్నతి కల్పించాలంటే పార్టీ జాతీయాధ్యక్షుడిగా ప్రకటించాల్సి ఉంటుంది. లేకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పించాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ టిడిపి శ్రేణులు మాత్రం లోకేష్ కు ఏకంగా పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే.. పదోన్నతి కింద రాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే ఏకంగా అధ్యక్ష పదవి ఇచ్చి.. చంద్రబాబు గౌరవ అధ్యక్ష పదవిలో కొనసాగాలన్న సూచనలు వస్తున్నాయి. లోకేష్ ను ప్రమోట్ చెయ్యడానికి ఇదే మంచి సమయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
* చురుగ్గా ఏర్పాట్లు..
కడపలో( Kadapa ) మహానాడుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పార్టీ విధానపరమైన నిర్ణయాలకు వేదికగా నిలుస్తూ వస్తోంది మహానాడు. మూడు రోజులపాటు పలు తీర్మానాలు చేయనున్నారు. మహానాడు వేదికగా చర్చించనున్నారు. అందులో భాగంగా లోకేష్ భవిష్యత్తు విషయంలో ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సైతం తనకు తాను ప్రూవ్ చేసుకున్నారు. ఓడిపోయిన చోటే అత్యధిక మెజారిటీతో గెలిచారు. కూటమి ప్రభుత్వంలో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే ముందుగా పార్టీలో పదోన్నతి కల్పిస్తే.. ప్రభుత్వంలో సైతం తన ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. మహానాడు వేదికగా కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: దేశభద్రతకు ఏపీ మార్గదర్శి..గుల్లలమోదలో క్షిపణి కేంద్రం!