Nara Lokesh CM post: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని.. చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. నారా లోకేష్ అయితే 2029 ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పుకొస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం తన 50 సంవత్సరాల రాజకీయ జీవితం త్వరలో సమీపిస్తుందని.. ఇంతకంటే ఓ నేతకు ఏం కావాలని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. సంస్థాగతంగా బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు వారసుడుగా లోకేష్ ఉన్నారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో త్వరలో లోకేష్ పట్టాభిషేకం చేయాలని టిడిపి శ్రేణులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో జన సేన శ్రేణులు మాత్రం ఎందుకు భిన్నంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు ఎవరికీ అవకాశం ఇస్తారు? ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది బలమైన చర్చ జరుగుతోంది.
చంద్రబాబు క్లారిటీ..
తాజాగా చంద్రబాబు( CM Chandrababu) ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్ లో మాట్లాడారు. తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు తాను చేసిన కృషిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలో పాలించానని.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టానని.. అంతకుమించి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించాలని.. తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాలకు పైగా సారధ్య బాధ్యతలు వహించానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 2028 నాటికి తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టి అర్థ శతాబ్దం దాటుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తద్వారా ముఖ్యమంత్రి పదవి మార్పు అనేది ఉండదని తేల్చి చెప్పారు. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
టిడిపిలో యువ నేత పట్టు
తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా నారా లోకేష్( Nara Lokesh ) ప్రూవ్ చేసుకున్నారు. అందులో ఎంత మాత్రం తప్పులేదు. అయితే ఈ రాష్ట్రం తో పాటు దేశానికి సమర్థ నాయకత్వాన్ని ఆహ్వానించాలని చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో లోకేష్ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకునేందుకు చంద్రబాబు అవకాశం కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో 2029 ఎన్నికల్లో కూటమి కట్టి.. కూటమి అధికారంలోకి వచ్చి.. టిడిపి సుస్థిరమైన సీట్లు సాధిస్తే.. తప్పకుండా నారా లోకేష్ కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అంటే 2029 ఎన్నికల్లోపు ముఖ్యమంత్రి మార్పు ఉండదన్నమాట. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపి సొంతంగా సీట్లు సాధించి… లోకేష్ నాయకత్వం మరింత అభివృద్ధి చెందిన మరుక్షణం.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కేటాయించడం ఖాయం. మరి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు చూడాలి.