Nara Lokesh Australia Tour: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల కిందట ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు లోకేష్. వచ్చే నెలలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఆస్ట్రేలియా వెళ్లారు. గత ఆరు రోజులుగా దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆపై ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ ఆంధ్రుల సహకారంతో పెట్టుబడులపై గురి పెట్టారు. ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయిన మరుక్షణం అదే పనిలో పడ్డారు లోకేష్. ఆరు రోజుల పర్యటన ముగించుకొని ఈ రాత్రికి ఏపీకి బయలుదేరనున్నారు.
డిజిటల్ ఆరోగ్య సేవలపై..
ఈరోజు పర్యటనలో చివరి రోజు కావడంతో లోకేష్( Nara Lokesh) బిజీ బిజీగా ఉన్నారు. బ్రిటీష్ మల్టీ నేషనల్ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ సంస్థ భూప ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బీజల్ సెజ్ పాల్, దినేష్ కంతేటి తదితరులతో మెల్ బోర్న్ లో సమావేశం అయ్యారు. విశాఖలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతోపాటు దిగ్గజ ఐటీ సంస్థల పెట్టుబడుల గురించి ప్రస్తావించారు. అందుకే గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవలో కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. దీనిపై బూపా సీఈవో బీజల్ సజ్ పాల్ సానుకూలంగా స్పందించారు. తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య బీమా డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్ లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోం లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తప్పకుండా విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతామని తెలిపారు.
Also Read: కర్నూలు కావేరి బస్సు ప్రమాదానికి కారణం ఇతడే..
టూర్ సక్సెస్..
మంత్రి నారా లోకేష్ ఆరు రోజులపాటు ఆస్ట్రేలియా పర్యటన( Australia tour) విజయవంతం అయింది. ఈనెల 19న మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. గత ఐదు రోజులుగా తన పర్యటనలో దేశంలోని పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. అక్కడ దిగ్గజ ఉన్నత విద్యాసంస్థలను సందర్శించారు. విద్యా బోధనతోపాటు మౌలిక వసతుల గురించి అధ్యయనం చేశారు. ఈరోజు సాయంత్రం ఆస్ట్రేలియాలో బయలుదేరి ఏపీ చేరుకోనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు గల్ఫ్ దేశాల్లో మూడు రోజులపాటు పర్యటించారు. ఆయన పర్యటన సైతం విజయవంతం అయింది.