Nara Lokesh: ఏ రంగంలోనైనా అనుభవం అనేది కీలకం. అనుభవం వచ్చే కొలది పరిణితి సాధిస్తారు. ఇప్పుడు నారా లోకేష్ లో( Nara Lokesh) అదే పరిణితి కనిపిస్తోంది. చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ రాజకీయంగా చాలా ఇబ్బందులు పడ్డారు. వాటిని అధిగమించేందుకు చాలా కష్టపడ్డారు. గెలుపోటములను సమానంగా తీసుకున్నారు. విమర్శలను సైతం సానుకూలంగా తీసుకొని.. రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నించారు. అందులో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్న జనసేనతో సమన్వయం చేసుకుంటున్నారు. బిజెపి అగ్రనేతలతో సైతం సన్నిహితంగా మెలుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే.. జూనియర్లతో రాజకీయం చేస్తున్నారు. భవిష్యత్తు లో తనతో పని చేసే యువ నాయకులతో చాలా సాన్నిహిత్యం పెంచుకున్నారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో లోకేష్ కు మంచి బంధమే ఉంది.
Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?
* చంద్రబాబుకు అండగా ఎర్రన్న..
చంద్రబాబుకు( CM Chandrababu) కుడి భుజంగా ఉండేవారు కింజరాపు ఎర్రం నాయుడు. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా.. చంద్రబాబును మాత్రం విడిచిపెట్టి వెళ్లలేదు. జాతీయస్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీ ఉనికి తగ్గకుండా చేయడంలో ఎర్రం నాయుడు పాత్ర ఉంది. అందుకే కింజరాపు కుటుంబానికి చంద్రబాబు సైతం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్రమంత్రిగా ఉన్న లోకేష్ విషయంలో మాత్రం చాలా గౌరవభావంతో ఉంటారు రామ్మోహన్ నాయుడు. అదే సమయంలో లోకేష్ సైతం రామ్మోహన్ నాయుడు విషయంలో చనువుగా ఉంటారు. తాజాగా వారి మధ్య బంధం మరోసారి బయటపడింది. విశాఖ పర్యటనలో రామ్మోహన్ నాయుడు విషయంలో లోకేష్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
* ప్రోటోకాల్ కు ప్రాధాన్యం..
విశాఖలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. అక్కడ జరిగిన ఓ సదస్సులో మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు( Ram Mohan Naidu ) హాజరయ్యారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులు చివరిగా మాట్లాడాల్సి ఉంది. అంతకు ముందుగానే మంత్రి లోకేష్ ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. ఇంతలో నేను మాట్లాడతాను అంటూ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తన స్థానం నుంచి పైకి లేచి ప్రసంగించడానికి వెళ్లబోయారు. ఇంతలో మంత్రి నారా లోకేష్ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని ఆపారు. లోకేష్ వారిస్తూ ‘ వద్దు రాము.. ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరిగా మాట్లాడాలి. ఇప్పుడు నేనే మాట్లాడతాను’ అంటూ లోకేష్ వెళ్లి ప్రసంగించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. లోకేష్ ఔన్నత్యాన్ని చాటుతోంది. పదవులను పక్కనపెట్టి అన్నదమ్ముల ఆత్మీయంగా ఉండడం తెలుసు. అదే సమయంలో పదవికి గౌరవం ఇవ్వడమూ తెలుసు. ఇది నారా లోకేష్ సమస్కారం. కేంద్రమంత్రికి ఇచ్చే గౌరవం అంటూ టిడిపి అధికారిక సోషల్ మీడియా ఒక పోస్ట్ చేసింది. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్రోటోకాల్ ఫస్ట్.. పదవులను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా ఆత్మీయంగా ఉండటం తెలుసు, అదే సమయంలో పదవికి గౌరవం ఇవ్వటమూ తెలుసు..
ఇది నారా లోకేష్ సంస్కారం, కేంద్ర మంత్రికి ఇచ్చే గౌరవం..విశాఖ నోవాటెల్ లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి… pic.twitter.com/BNyqIfbSRT
— Telugu Desam Party (@JaiTDP) August 29, 2025