Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా పాలనాపరమైన వ్యవహారాల్లో ఉండడంతో.. లోకేష్ అన్నీ తానై చక్కదిద్దుతున్నారు. ముఖ్యంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గడిచిన ఎన్నికల్లో రాయలసీమలో ఘనవిజయం సాధించింది తెలుగుదేశం కూటమి. టిడిపి ఆవిర్భావం తర్వాత ఇదే సాలిడ్ విజయం. అయితే ఇంతటి ప్రభంజనంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది. ఇది తెలుగుదేశం పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన అనుమానమే. పార్టీ ఓటమిపై పోస్టుమార్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలోనే పెద్దిరెడ్డి కుటుంబం గెలవడంపై అనుమానం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం సైతం విస్మయం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అనే దానిపై అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. ఇటు తెలుగుదేశం నాయకత్వానికి ఒక క్లారిటీ వచ్చింది.
* జయచంద్ర రెడ్డి ఆయన మనిషేనా? తంబళ్లపల్లెలో( thamballapalle ) గెలిచారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఆయనపై ఓడిపోయారు జయ చంద్రారెడ్డి. ఆయనే తాజాగా మద్యం కల్తీ వ్యవహారంలో బుక్కయ్యారు. పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. సరిగ్గా ఎన్నికల కు ముందు టిడిపిలో చేరారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మద్యం వ్యవహారంలో చిక్కుకున్నారు. అయితే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్ అని.. ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని టిడిపి కూటమి అనుమానిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే జయ చంద్రారెడ్డి టిడిపిలో చేరారు అన్నది తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి అలానే గెలిచారని టిడిపి భావిస్తోంది. అందుకే ఇప్పుడు తంబళ్లపల్లెపై ఫుల్ ఫోకస్ పెట్టారు నారా లోకేష్.
* కోవర్టులకు తావు లేకుండా..
తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పై సస్పెన్షన్ వేటు పడడంతో.. అక్కడ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు ఈ అనుభవాల దృష్ట్యా.. పెద్దిరెడ్డికి కోవర్టులు అనేవారికి పార్టీతో సంబంధం లేకుండా చేయాలని నారా లోకేష్( Nara Lokesh) భావిస్తున్నారు. బలమైన నేతను బరిలో దించాలని చూస్తున్నారు. ఇక్కడ శంకర్ యాదవ్ గతంలో టిడిపి ఇన్చార్జిగా ఉండేవారు. ఆయనను కాదని జయ చంద్రారెడ్డిని టికెట్ ఇచ్చారు. కానీ ఈసారి శంకర్ యాదవ్ కాకుండా బలమైన నేతను రంగంలోకి దించాలని చూస్తున్నారు. నారా లోకేష్ దీనిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు కు అవకాశం ఇస్తారని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో మదనపల్లె టికెట్ ఆశించారు ఆయన. వివిధ సమీకరణల్లో దక్కలేదు. అయితే ఇప్పుడు శ్రీరామ్ చినబాబుకు తంబళ్లపల్లె నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా పెద్దిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం.