Pradeep Ranganathan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్…మొదట దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘లవ్ టుడే’ సినిమాతో హీరోగా మారాడు. దర్శకుడిగా చేస్తూనే హీరోగా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఈ సంవత్సరం ఇప్పటికే ‘డ్రాగన్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘డ్యూడ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది.
ఈ ట్రైలర్లో అద్భుతమైన నటన తీరును కనబరిచిన ఆయన సినిమా మొత్తం కామెడీ ఎమోషన్ ను ఆడ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో కూడా ఆయన సక్సెస్ ని సాధిస్తే ఆయన ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వాడు అవుతాడు…
నిజానికి ఆయన అంత మంచి స్టోరీస్ ను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మొదట ఆయన డైరెక్టర్ కావడం వల్లే అతని స్టోరీల మీద మంచి గ్రిప్ ఉంది. ఇక దాంతో పాటు గా అతని వెనకాల ఒక స్టార్ హీరో ఉన్నాడని అతను ఆ స్టోరీలకు సంబంధించిన సలహాలను, సూచనలను తనకు ఇస్తూ ఉంటాడని అందువల్లే ఆయన మంచి సినిమాలను చేయగలుగుతున్నాడంటూ మరికొంత మంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే ధనుష్ గా తెలుస్తోంది. ధనుష్ కి తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన నటనలో కూడా ఎక్కువగా ధనుష్ కనిపిస్తుంటాడు. ధనుష్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేసిన ప్రదీప్ రంగనాథన్ తనకి బాగా నచ్చిన స్క్రిప్ట్ ను ధనుష్ కి చెబుతూ ఉంటాడు. దానివల్ల ధనుష్ కూడా ప్రదీప్ రంగనాథన్ కి కొన్ని సలహాలైతే ఇస్తుంటాడట. మొత్తానికైతే ప్రదీప్ రంగనాథన్ అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా కొనసాగుతుండటం విశేషం…ఇక ఫ్యూచర్ లో ఆయన టాప్ హీరోగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదు…