Nara Lokesh:ఏపీ మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. అక్కడ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడంతో పాటు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా అమెరికా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను ఆస్ట్రేలియా ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఏపీలో ఆక్వారంగం సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అమెరికాకు భారీగా ఎగుమతి అవుతున్న ఏపీ రొయ్యలపై సుంకం విధించడంతో ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని ప్రభావం ఆక్వారంగంపై ఆధారపడిన పది రకాల అనుబంధ రంగాలపై పడుతోంది. ఈ పరిణామంతో విలవిలలాడుతున్నారు ఏపీ వాసులు. అందుకే దానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.
* అగ్ర భాగం అమెరికాకే..
ఏపీ( Andhra Pradesh) నుంచి రొయ్యలు 90% విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందులో అగ్ర భాగం అమెరికాకు.. అటు తరువాత జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే అమెరికా సుంకాలతో రొయ్యల దిగుమతికి డోర్ క్లోజ్ అయింది. ఈ తరుణంలో ఆక్వారంగం సంక్షోభంలో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా వెళ్లిన మంత్రి నారా లోకేష్ అక్కడి ఆక్వారంగం ప్రతినిధులతో చర్చించారు. ఏపీ నుంచి ఎగుమతులకు సంబంధించిన కీలక ఒప్పందం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు.’ భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతుల్లో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయింది. గతంలో తెల్ల మచ్చ వైరస్ ఉన్న రొయ్యలను తొక్క తీయకుండా ఆస్ట్రేలియా దిగుమతి చేసుకోలేదు. కానీ ఇప్పుడు భారత్ నుంచి వచ్చే రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. ఈ విజయం వెనుక భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాల కృషి ఎంతో ఉంది. వారికి నా కృతజ్ఞతలు. ఒకే మార్కెట్ పై ఆధారపడకుండా కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం చాలా ముఖ్యం’ వన్ టూ త్రీ చేశారు నారా లోకేష్.
* ఇతర దేశాల్లో సైతం గిరాకీ..
వాస్తవానికి ఏపీ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలకు ఆస్ట్రేలియా తో( Australia) పాటు సౌదీ అరేబియా దేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. అమెరికా కొట్టిన దెబ్బతో ఇబ్బందుల్లో ఉన్న ఆక్వారంగాన్ని మెరుగు పరచాలంటే ఆ దేశాలకు ఎగుమతులు పెంచడంపై ఫోకస్ పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించింది. రష్యాలో సైతం మన రొయ్యకు గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు అమెరికాతో సమానమైన ధరను ఈ దేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆస్ట్రేలియా తో సహృద్భావ వాతావరణంలో లోకేష్ చర్చించగలిగారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతి చేసేందుకు లైన్ క్లియర్ చేశారు. సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం అయ్యారు లోకేష్. ఆక్వా ఎగుమతుల అంశంపై వారితో చర్చించారు. ఇవి సానుకూల ఫలితాలు రావడంతోనే లోకేష్ ఈ ట్వీట్ చేశారు.
#Australia #InvestInAP
A long-standing hurdle for Indian seafood exporters has been Australia’s restrictions on unpeeled prawns due to white spot virus detection.Today, the first import approval for Indian prawns has been granted. Our deepest gratitude to the extensive work… pic.twitter.com/jH5wtCWf06
— Lokesh Nara (@naralokesh) October 21, 2025