Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: కోర్టుకు లోకేష్.. జగన్ కు మాత్రం మినహాయింపులు!

Nara Lokesh: కోర్టుకు లోకేష్.. జగన్ కు మాత్రం మినహాయింపులు!

Nara Lokesh: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) రాజకీయం వేరేలా ఉండేది. పాలనా వ్యవస్థలో న్యాయస్థానాల జోక్యాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నించే దాకా పరిస్థితి వచ్చింది. చివరకు ఆ పార్టీ సోషల్ మీడియా కాలకేయ సైన్యం న్యాయమూర్తులను కించపరిచే స్థితికి చేరుకున్నారు. అలా చాలామంది అరెస్టయ్యారు కూడా. అయితే అప్పట్లో పాలనా వ్యవస్థ పై న్యాయవ్యవస్థ జోక్యం ఏమిటని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక నేత అప్పట్లో ప్రశ్నించారు అంటే ఏ స్థాయికి దిగజారారో అర్థం అవుతుంది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలి. కేవలం ప్రజా జీవితం అనేది ప్రజలు ఇచ్చే తీర్పు పట్టి ఉంటుంది. రాజకీయ జీవితానికి ఆయుష్షు తక్కువ. అది కూడా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. స్వల్ప కాలమే ఉంటుంది. అయితే ఈ విషయంలో తాను అతీతుడిని అని భావించారు జగన్మోహన్ రెడ్డి.

* రాజ్యాంగ వ్యవస్థలకు..
అయితే ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థలు గౌరవించబడతాయో అక్కడ ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుంది.. ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). రాజ్యాంగ వ్యవస్థలతోనే ఒక ఆట ఆడుకున్నారు. చివరకు 12 సంవత్సరాల పాటు బెయిల్ పై బయట ఉన్న ఆయన కోర్టు మెట్లు ఎక్కకుండా.. విచారణలకు హాజరు కాకుండా ఎన్నో రకాల మినహాయింపులు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ అందుకు విరుద్ధంగా వ్యవహరించి శభాష్ అనిపించుకుంటున్నారు. లోకేష్ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ సాక్షి చాలా రకాల కథనాలు ప్రచురించింది. అయితే తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన సాక్షిపై ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. విశాఖలోని జిల్లా కోర్టుకు క్రమం తప్పకుండా విచారణలకు హాజరవుతున్నారు. ఒక సామాన్య పౌరుడిలా న్యాయం కోసం వేచి చూడడం వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది.

* బాధితుడుగా ఉన్న కేసులో సైతం..
అయితే న్యాయవ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. తనపై ఉన్న అక్రమస్తుల కేసులు కావచ్చు.. లేకుంటే తాను బాధితుడిగా ఉన్న కోడి కత్తి కేసు కావచ్చు. కోర్టుకు హాజరు కావడానికి ఆయన ఎప్పుడూ విముక్తిత చూపుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రతా కారణాలు, పాలనాపరమైన బిజీ అని చెప్పి మినహాయింపులు ఇప్పించుకున్నారు. తన హయాంలోనే రోజుల తరబడి కోడి కత్తి విచారణ జరగకుండా అడ్డుకున్నారన్న విమర్శ ఆయనపై ఉంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో జగన్ బాధితుడు. కానీ సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు మాత్రం ఒక్కసారి కూడా హాజరు కాలేదు. బాధితుడుగా ఉంటూ కోర్టు విచారణకు రాకపోవడాన్ని ఏమనాలి? న్యాయవ్యవస్థను గౌరవించేవారు తప్పనిసరిగా సత్వర న్యాయం కోసం కోర్టుకు హాజరవుతారు. సహకారం అందిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడికి ఉండకూడని లక్షణం అది.

* న్యాయ పోరాటం..
కొద్దిరోజుల కిందట సాక్షి మీడియా లోకేష్ పై ( Nara Lokesh) ఒక నిరాధారమైన కథనం ప్రచురించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఖండించి వదిలేయలేదు. తనపై తప్పుడు వార్త రాసిన పత్రికను న్యాయస్థానంలో నిలదీశారు. ఇందుకోసం తనకు ఉన్న అమూల్యమైన సమయాన్ని సైతం కోర్టుకు కేటాయిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని నమ్మడమే కాదు.. ఆ ప్రక్రియలో తాను కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి, లోకేష్ కు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version