https://oktelugu.com/

Nara Lokesh : ఆస్పత్రిలో చేరిన నారా లోకేష్.. ఏమైంది?

అందుకే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసేందుకు ఆస్పత్రిలో చేరారు. అయితే కేవలం భుజం నొప్పితోనే ఆస్పత్రిలో చేరారని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. 

Written By:
  • Dharma
  • , Updated On : May 18, 2023 / 12:26 PM IST
    Follow us on

    Nara Lokesh : ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు యువనేత నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పేరిట చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో పూర్తయిన యాత్ర వంద రోజులు పూర్తిచేసుకుంది. ఇంకా 300 రోజుల పాటు కొనసాగనుంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ లోకేష్ నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆస్పత్రిలో చేరడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్నట్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం నంద్యాల జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే  ఆయన ఉన్నట్టుండి నంద్యాలలో మ్నాగ్నా ఎంఆర్ఐ సెంటర్ లో చేరారు. వైద్యులు పరీక్షలతో పాటు స్కానింగ్ చేశారు. ఒక్కసారిగా ఈ ఫొటోలు బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు ఆరాతీయడం ప్రారంభించాయి. గత కొద్దిరోజులుగా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. మొన్న ఆ మధ్యన హిందూపురం జిల్లా కదిరిలో ఒక్కసారిగా వచ్చిన కార్యకర్తలతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. నంద్యాలలో నొప్పి ఎక్కువ కావడంతో వైద్యుల సలహా మేరకు భుజానికి స్కానింగ్ చేశారు.

    దాదాపు 100 రోజుల పాటు యాత్ర కొనసాగినా లోకేష్ కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. ఒక వైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో లోకేష్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన కాలికి బొబ్బలు కడుతున్నాయి. వ్యక్తిగత వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే భుజానికి నొప్పి పెట్టగా.. దీనికితోడు సెల్ఫీలతో నొప్పి మరింత తీవ్రమవుతోంది. రోజుకు సగటున వేలాది మంది లోకేష్ సెల్ఫీలు ఇవ్వాల్సి వస్తోంది. అదే భుజానికి పనిచెప్పాల్సి వస్తోంది. దీంతో ఆయన భుజం నొప్పి ఇంకా ఎక్కువైంది. ఫిజియో థెరపీ డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గలేదని సమాచారం. అందుకే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసేందుకు ఆస్పత్రిలో చేరారు. అయితే కేవలం భుజం నొప్పితోనే ఆస్పత్రిలో చేరారని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.