Nandigama : సాధారణంగా కిడ్నీ( kidney) దానం చేయడం చూస్తుంటాం. ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు కుటుంబ సభ్యులు దానం చేస్తుంటారు. అయితే ఓ మహిళను బతికించుకోవడానికి ఇంట్లో ఉన్న వాళ్లంతా కిడ్నీ దానం చేశారు. ఇప్పటికే రెండుసార్లు కుటుంబ సభ్యులు కిడ్నీలు దానం చేశారు. అయినా ఫెయిల్ అయింది. ఇప్పుడు మూడోసారి కూడా కుటుంబ సభ్యులకి కిడ్నీ దానం చేయబోతున్నారు. ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇలా కిడ్నీ మార్పిడి చికిత్స ఒకరికే మూడుసార్లు చేయడం చాలా అరుదు అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read : దువ్వాడ మాధురి.. ఇంటర్వ్యూల్లో అసలు తగ్గేదేలేదుగా
* కుటుంబ సభ్యులంతా దానం..
ఎన్టీఆర్ జిల్లా( NTR district) నందిగామ కు చెందిన ఓ మహిళకు కిడ్నీ ఫెయిల్ అయింది. ఆమెకు రెండుసార్లు కిడ్నీ మార్పిడి సర్జరీ చేశారు. ఆ మహిళకు మొదటిసారి తల్లి కిడ్నీ దానం చేశారు. రెండోసారి భర్త ఇచ్చారు. కానీ ఆ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆ మహిళకు మూడోసారి కూడా కిడ్నీ మార్చాలని చెబుతున్నారు వైద్యులు. దీంతో ఈసారి ఆ మహిళకు కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి ముందుకు వచ్చారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్లు మూడోసారి ఆమెకు కిడ్నీ మార్పిడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఒకే మహిళకు మూడుసార్లు కిడ్నీ మార్పిడి సర్జరీ చేయడం చాలా అరుదైన విషయం అని చెబుతున్నారు వైద్యులు.
* గతంలో హైదరాబాదులో..
అయితే గతంలో హైదరాబాద్ లో( Hyderabad) సైతం ఇటువంటి అరుదైన ఘటన జరిగింది. సాహూ అనే వ్యక్తికి 30 ఏళ్లలో మూడుసార్లు ఇడ్లీ మార్పిడి చేశారు. మరో రెండు నుంచి మూడేళ్ల పాటు ఆసుపత్రిలో డయాలసిస్ ఇచ్చారు. మొదట సోదరుడు, రెండోసారి తల్లి ఆయనకు కిడ్నీ దానం చేశారు. తల్లి ఇచ్చిన కిడ్నీతో దాదాపు 11 ఏళ్ల పాటు జీవనం సాగించారు. అది పాడవడంతో మరో రెండున్నర ఏళ్ల పాటు డయాలసిస్ చేయించుకుంటూ జీవనం గడిపారు. మూడోసారి బయట దాత నుంచి సేకరించి మార్పిడి చేశారు. ఆ కిడ్నీ ని అమర్చి, రక్తనాళాల ద్వారా అనుసంధానం చేయడం వైద్యులకు సవాల్ గా మారింది. అయితే తరువాత కిడ్నీ విజయవంతంగా అమర్చగలిగారు. తాజాగా ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు.. ఆ మహిళకు కిడ్నీ ఇవ్వడం మాత్రం నిజంగా సాహసం అనే చెప్పవచ్చు.