Homeఎంటర్టైన్మెంట్Shivaji : బిగ్ బాస్ బాగా కలిసొచ్చిందిగా... అదిరిందయ్యా శివాజీ!

Shivaji : బిగ్ బాస్ బాగా కలిసొచ్చిందిగా… అదిరిందయ్యా శివాజీ!

Shivaji : మూడు దశాబ్దాల క్రితమే శివాజీ చిత్ర పరిశ్రమకు వచ్చాడు. ప్రారంభంలో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. హీరో ఆఫర్స్ రావడంతో సద్వినియోగం చేసుకున్నాడు. శివాజీ నటించిన మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. శివాజీ సడన్ గా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఆయన పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. 2014లో ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక.. ఆయనపై విమర్శల దాడి చేశాడు.

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరక్కపోతే కేంద్రం దగ్గర పరపతి ఉండేది. గట్టిగా నిధులు అడిగే ధైర్యం బాబుకు లేదని ఓపెన్ కామెంట్స్ చేశాడు. అనంతరం యూ టర్న్ తీసుకున్న శివాజీ.. చంద్రబాబు మీద ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. గరుడ పురాణం అంటూ శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయగా.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక శివాజీ కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన అమెరికాలో ఎక్కువగా ఉండేవాడు.

Also Read : మల్లెమాలతో విబేధాలు..జబర్దస్త్ నుండి శివాజీ అవుట్..రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్!

శివాజీ గురించి జనాలు మర్చిపోతున్న టైం లో బిగ్ బాస్ హౌస్లో ప్రత్యక్షమయ్యాడు. శివాజీ యాటిట్యూడ్, బిహేవియర్ తెలిసిన ఆడియన్స్.. ఆయన షోకి వస్తాడని అసలు ఊహించలేదు. బిగ్ బాస్ సీజన్ 7లో శివాజీ కంటెస్ట్ చేశాడు. హౌస్లో పెద్దరికం కొనసాగించాడు. పల్లవి ప్రశాంత్, యావర్ లను శిష్యులుగా చేసుకుని గేమ్ ఆడాడు. సీజన్ 7 టైటిల్ శివాజీదే అని ప్రచారం జరిగింది. పల్లవి ప్రశాంత్ అద్భుతంగా గేమ్ ఆడి టైటిల్ ఎగరేసుకుపోయాడు. నా శిష్యుడే టైటిల్ గెలిచాడు కాబట్టి , నేను హ్యాపీ అని శివాజీ అన్నాడు.

బిగ్ బాస్ షో కొందరి కెరీర్స్ కి మైనస్ అవుతుంది. శివాజీ కి మాత్రం బాగా ప్లస్ అయ్యింది. ఆయన నటించిన వెబ్ సిరీస్ 90స్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఆదరణ దక్కించుకుంది. ఈటీవి విన్ లో స్ట్రీమ్ అవుతున్న నైంటీస్ సక్సెస్ కావడంతో శివాజీకి మంచి కమ్ బ్యాక్ దొరికినట్లు అయ్యింది. జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాడు. నాని నిర్మాతగా తెరకెక్కిన కోర్ట్ మూవీలో శివాజీ ప్రధాన విలన్ రోల్ చేశాడు. ఆ పాత్రలో శివాజీ ఇరగదీశాడని జనాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో శివాజీ నటుడిగా బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

Also Read : అల్లు అర్జున్ ని నాలో చూసుకోవడం కరెక్ట్ కాదు అంటూ బిగ్ బాస్ శివాజీ షాకింగ్ కామెంట్స్!

RELATED ARTICLES

Most Popular