Nandamuri Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణది( Nandamuri Balakrishna ) విలక్షణ శైలి. సినిమాల్లో అలవోకగా డైలాగులు చెబుతారు కానీ… నిజజీవితంలో మాత్రం అందుకు విరుద్ధం. చాలా తడబడుతూ మాట్లాడుతారు. అయినా సరే ప్రజలు ఆయనను ఇష్టపడతారు. అంతలా ఉంటుంది ఆయన పనితనం. అయితే రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు బాలకృష్ణ. అది కూడా ఏదో అరుదుగానే. అప్పట్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎండగట్టే క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంలో వైసిపి హయాంలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ.. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన రావడం వివాదాస్పదంగా మారింది. అయితే అక్కడి నుంచి స్పందించే విషయంలో బాలకృష్ణ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. తాజాగా ఆయన అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. ఈ క్రమంలో విలేకరులు జగన్మోహన్ రెడ్డి పై స్పందించాలని కోరగా… బాలకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.
* జగన్ మావిగన్ ప్రతిపాదనపై..
మొన్న మధ్యన అమరావతి రాజధాని( Amaravathi capital ) బదులు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానిపై ఒక్క వైసీపీ నేతలు తప్ప మిగతా వారంతా వ్యతిరేకించారు. అదో పిచ్చి ప్రతిపాదనగా తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కు గురయ్యారు. నెటిజెన్లు ఒక ఆట ఆడుకున్నారు. చివరకు అనుకూల విశ్లేషకులు, మీడియా ప్రతినిధులు సైతం తప్పుపట్టారు. అయితే తాజాగా దానిపై స్పందించాలని విలేకరులు నందమూరి బాలకృష్ణను కోరారు. కానీ ఆయన తన స్పందన నోటితో తెలియజేయలేదు. అదో వెర్రి ప్రతిపాదన అంటూ సంకేతాలు ఇచ్చారు. ముఖ కవళికలతో పాటు చాలా సింపుల్ గా తీసి పక్కన పెట్టేసారు. కనీసం మాట్లాడకుండానే బాలకృష్ణ అలా స్పందించేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు.
* సహజ శైలికి భిన్నంగా..
ఏదైనా అంశాన్ని కుండ బద్దలు కొట్టి మాట్లాడడం నందమూరి బాలకృష్ణ కు అలవాటు. కానీ ఇటీవల ఆయన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు. అందుకే వీలైనంతవరకు మీడియాతో మాట్లాడడం లేదు బాలకృష్ణ. తాజాగా జగన్ మావిగన్‌పై కూడా బాలకృష్ణ తన సైగలతోనే సమాధానం చెప్పారు. చాలా సింపుల్ గా.. చాలా కూల్ గా.. ఒకే ఒక్క ముఖ కవళికతో తేల్చి చెప్పడం విశేషం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి శ్రేణులు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మాట్లాడకుండానే బాలకృష్ణ తన స్పందన తెలియజేయడం అందరినీ ఆకట్టుకుంటుంది.