Bigg Boss 9 Video Leak: ఈసారి ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) షో కంటే ఎక్కువగా అగ్ని పరీక్ష(Agnipareeksha) షో కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడండి కాన్సెప్ట్ అవ్వడం వల్లనే ఈ కాంటెస్ట్ కి ఇంతటి క్రేజ్ ఏర్పడింది. సామాన్యులకు అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సుమారు 18 వేల మంది బిగ్ బాస్ షో లో పాల్గొనేందుకు దరఖాస్తులు పంపించారు. వాటి నుండి దాదాపుగా 200 మందిని ఎంచుకొని వంద మందిని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి, ఆ వంద మందికి గ్రూప్ డిస్కషన్ జరిపి కేవలం 45 మందిని మాత్రమే అగ్నిపరీక్ష షో కి పంపించారు. గత రెండు మూడు రోజుల నుండి ఈ అగ్నిపరీక్ష షో కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. ఈ నెల 22 నుండి జియో హాట్ స్టార్ లో ఈ కాంటెస్ట్ టెలికాస్ట్ కానుంది.
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
అయితే ఈ షో కి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. నవదీప్, అభిజిత్, బిందు మాధవి కూర్చొని ఉంటారు. ఒక కంటెస్టెంట్ చేసిన ఓవర్ యాక్షన్ కి బిందు మాధవి ఫైర్ అవుతుంది. ‘ఓయ్..ఎందుకు నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్’ అని అరుస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న నవదీప్ కోపం తో అరుస్తూ పైకి లేచి వెళ్లిపోతుంటాడు. ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. ఎంతో కూల్ గా ఉండే నవదీప్ లాంటోడికి కూడా కోపం రప్పించారంటే ఆ కంటెస్టెంట్ ఎలాంటి వాడు అయ్యుంటాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతే కాదు అభిజీత్ కూడా కొంతమంది కంటెస్టెంట్స్ తో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయట. చూస్తుంటే ఈసారి సామాన్యుల క్యాటగిరీ లో వచ్చే కంటెస్టెంట్స్ మామూలుగా ఉండేలా లేరు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది అనేది.
బిగ్ బాస్ తెలుగు 9 ‘అగ్నిపరీక్ష’ వీడియో లీక్
Bigg Boss Telugu 9 Sensation!‘అగ్నిపరీక్ష’ వీడియో లీక్… నవదీప్ ఫస్ట్రేషన్ తో లేచిపోయాడు!#BiggBossTelugu9 #Agnipariksha #Navdeep #BiggBossTelugu #BBT9 #BiggBossUpdate #TeluguNews pic.twitter.com/iVdk33i1Z3
— OkTelugu (@oktelugunews) August 13, 2025