AP Fake liquor : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలను బయటపెట్టాడు. వైఎస్ఆర్సీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారీ చేసినట్టు ఆయన అంగీకరించాడు.
జనార్ధన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. టిడిపి ప్రభుత్వం ఏర్పడకముందే జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ వ్యాపారం కొనసాగిందట. “టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిఘా పెరగడంతో ఆ వ్యాపారం ఆపేశాం. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ నన్ను సంప్రదించి, చంద్రబాబు ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చేందుకు మళ్లీ నకిలీ మద్యం తయారీ ప్రారంభించాలని ఒత్తిడి చేశారు” అని జనార్ధన్ రావు చెప్పాడు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో మొదట తయారీ ప్రారంభించామని, అక్కడి నుండి చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించాడు. “జోగి రమేష్ సూచనల మేరకు వేరే పేర్లతో గదులు అద్దెకు తీసుకుని, యంత్రాలు కొనుగోలు చేశాం. ప్రభుత్వం మీదే రుద్దుదాం అని ఆయన అన్నారు. నా ఆర్థిక ఇబ్బందులు తీర్చుతానని హామీ ఇచ్చారు” అని చెప్పాడు.
తయారీ మొత్తం సిద్ధమైన తర్వాత, తనను ఆఫ్రికాకు పంపించారని, అక్కడ నుండి జోగి రమేష్ తన సిబ్బంది ద్వారా డిపార్ట్మెంట్‌కి లీక్ ఇచ్చి రైడ్ చేయించాడని జనార్ధన్ రావు ఆరోపించాడు. “దీని వెనుక ఉద్దేశ్యం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోవడం. సాక్షి మీడియాను కూడా ముందుగానే అక్కడికి తీసుకెళ్లారు. రైడ్ తర్వాత అంతా బాగానే జరిగిందని, నేను రాకూడదని జోగి రమేష్ చెప్పారు. కానీ తర్వాత ఆయన హ్యాండ్ ఇచ్చి బెయిల్ కూడా ఇవ్వలేదు” అని జనార్ధన్ రావు వెల్లడించాడు.
ఇక తన తమ్ముడిని కూడా ఈ కేసులో ఇరికించారని, ఆఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్న జై చంద్రారెడ్డిని కూడా కుట్రలోకి లాగారని ఆయన పేర్కొన్నాడు. “జోగి రమేష్ నాకు చిన్నప్పటి పరిచయం. ఆయన నమ్మకం వాడుకుని మోసం చేశారు. అందుకే ఇక దాచలేక బయటకు వచ్చి నిజం చెబుతున్నాను” అని జనార్ధన్ రావు సంచలనంగా వెల్లడించాడు.
ఈ కొత్త వెల్లడి రాజకీయంగా భారీ దుమారం రేపనుంది. జోగి రమేష్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో వైఎస్ఆర్సీపీ వర్గాలు సతమతమవుతున్నాయి. మరోవైపు, టిడిపి నేతలు ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకుని, పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
నకిలీ మద్యం కేసులో జనార్దన్ సంచలన వీడియో
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పారు
జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ
ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికే కుట్ర చేశారు
కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం
ఈ ఏడాది ఏప్రిల్ లో… pic.twitter.com/VBwEMwwF4v
— ChotaNews App (@ChotaNewsApp) October 13, 2025