Nagendra Babu-Lokesh : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది వాస్తవం అని ఎదో ఒక ఉదాహరణ మనకు తెలియచేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాగ బాబు(Nagendra Babu Konidela), నారా లోకేష్(Nara Lokesh) కలయిక కూడా అలాంటిదే. గతంలో నాగబాబు టీడీపీ పార్టీ పై, ఆ పార్టీ లోని నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ లపై ఏ స్థాయిలో విమర్శలు చేశాడో మన అందరికీ తెలుసు. అంత తేలికగా మన తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అయితే నేడు వీళ్లిద్దరు పాలు నీళ్లు లాగా కలిసిపోయారు. ఎమ్మెల్యే కోటాలో నాగబాబు కి ఎమ్మెల్సీ పదవి వచ్చేలా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చంద్రబాబు(CM Chandrababu Naidu) తో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. చివరి నిమిషం వరకు నాగబాబు కి ఎమ్మెల్సీ(MLC) సీటు వస్తుందా లేదా అనే విషయం పై ఉత్కంఠ నెలకొంది కానీ, పవన్ కళ్యాణ్ ఇంతలోపు నాగబాబు కి ఎమ్మెల్సీ నామినేషన్ వేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించడంతో ఉత్కంఠ వీడింది.
Also Read : వాట్సాప్ గవర్నెన్స్.. త్వరలో మరో 200 సేవలు.. మంత్రి లోకేష్ సంచలన ప్రకటన!
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది నాగబాబు నామినేషన్ ని బలపరుస్తూ సంతకాలు చేయగా, టీడీపీ తరుపున నారా లోకేష్, బీజేపీ తరుపున విష్ణు కుమార్ రాజు కూడా నామినేషన్ ని బలపరుస్తూ సంతకాలు చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోలను చూస్తుంటే, గతం లో వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న ఘటనే గుర్తొస్తుంది. అదేంటి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పై, లోకేష్ పై విమర్శలు చేశాడు కదా, ఇప్పుడు కలిసిపోయాడు, ప్రభుత్వాన్ని స్థాపించి 9 నెలలు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా అలాంటివి గుర్తు రావడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ నాగబాబు అప్పట్లో లైన్ క్రాస్ చేసి మరీ కామెంట్స్ చేశాడు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు కూడా నాగబాబు ఎమ్మెల్సీ సభ్యత్వం పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే గతం లో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మంత్రి అవ్వడం పై తీవ్రమైన విమర్శలు చేశాడు. లోకేష్ దొడ్డిదారిలో మంత్రి అయ్యాడని, ప్రజల ఓట్ల ద్వారా అవ్వలేదని తీవ్ర స్థాయిలో మండిపడేవాడు. కానీ ఇప్పుడు తన అన్నయ్య నాగబాబు ని కూడా అదే దారిలో ఎమ్మెల్సీ ని చేసి, రేపో మాపో మంత్రిని కూడా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఒకరిని అనే మాటలు తిరిగి మనకే వర్తిస్తాయి అనడానికి ఉదాహరణ ఇదే అంటూ టీడీపీ పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగబాబు కి ఏ శాఖలో మంత్రి పదవి లభించనుంది అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ శాఖల్లో అతి ముఖ్యమైన అటవీ శాఖ ని నాగబాబు కి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
Also Read : విజయసాయిరెడ్డి యూ టర్న్.. జూన్ లో స్ట్రాంగ్ డెసిషన్.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్!
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారు నామినేషన్ దాఖలు
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రులు శ్రీ @mnadendla గారు, శ్రీ @naralokesh గారు, బీజేపీ శాసనపక్ష నేత… pic.twitter.com/rWEACJ6a8d
— JanaSena Party (@JanaSenaParty) March 7, 2025