Nagababu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భారీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారా?అందులో భాగంగానే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నారా? ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయాలకు పవన్ శ్రీకారం చుట్టనున్నారా?అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయాలా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్యాబినెట్ లో ఉన్నారు. మరోవైపు సోదరుడిని తీసుకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియంది కాదు. అయితే ఈ విషయంలో పవన్ ఆలోచన వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత.. పొలిటికల్ స్ట్రాటజీ మారిపోయింది. నేరుగా సీఎం చంద్రబాబును కలిసి ఢిల్లీ పెద్దలతో చర్చించిన అంశాలను వివరించారు పవన్. ఇప్పుడు తాజాగా నాగబాబుకు మంత్రి పదవి ప్రకటన తర్వాత దీనిపై స్పష్టత వస్తోంది. ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని.. ఆ తదుపరి పవన్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
* జాతీయస్థాయిలో గుర్తింపు
సనాతన ధర్మ పరిరక్షణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. జాతీయ స్థాయిలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు పవన్. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఆయన చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో బిజెపితో పాటు కూటమి ఘనవిజయం సాధించింది. దీంతో పవన్ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోయింది. బిజెపి పవన్ ను ఒక తురుపు ముక్కగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తో పాటు సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర పెద్దలు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.
* కేంద్ర క్యాబినెట్ లోకి
అయితే పవన్ జాతీయస్థాయిలో ఇమేజ్ పెంచాలంటే కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకొని పవన్ సేవలను వినియోగించుకుంటే ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుందని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ముందుగా నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని.. కొద్ది రోజులు అయిన తర్వాత పవన్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని తెలుస్తోంది. పవన్ కు కీలకమైన పోర్టు పోలియోతో పాటు ఎన్డీఏ పరంగా బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలు పవన్ తో చెప్పగా .. ఆయన చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే పవన్ నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నేరుగా అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అంటే త్వరలో పవన్ కేంద్ర రాజకీయాల వైపు వెళ్లిపోతారన్నమాట.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Nagababu into the cabinet guidance of central elders pawans strategy is the same
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com