Chicken : మీరు చికెన్ ప్రియులా.. వారానికి కనీసం రెండు మూడుసార్లు తింటారా.. అయితే ఇది మీకు బ్యాడ్ న్యూసే(Bad News). ఎందుకంటే.. చికెన్ అంటే ఇష్టపడని మాంసం ప్రియులు ఉండరు. చికెన్ తయారు చేస్తుంటేనే ఆమడ దూరం ఘుమఘుల వాసన వస్తుంది. దీంతో పక్కింట్లో చికెన్ వండితే.. మన ఇంట్లోవారి నోట్లో నీళ్లు ఊరుతాయి. అయితే చికెన్ ప్రియులకు ఇప్పడు ఒక షాకింగ్ న్యూస్ ఇది. అంతుచిక్కని వైరస్(Virus)తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించిన కోడి తెల్లవారుజాము వరకు చనిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈ వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో చికెన్ తినేవార జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
లక్షకుపైగా కోళ్లు మృతి..
కొత్త, అంతుచిక్కని వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటికే లక్షకుపైగా(Above One Lakh) కోళ్లు మృత్యువాతపడ్డాయి. పందేల కోసం పెంచిన ప్రత్యేక కోళ్లు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నాయి. దీంతో కోళ్ల పెంపకం దారులు భారీగా నష్టపోతున్నా. ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా ప్రభావితం చూపిందని పౌల్ట్రీ(Poultry) యజమానులు పేర్కొంటున్నారు. అప్పట్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో మార్కెట్‌లో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. వైరస్ తగ్గుముఖం పట్టడానికి చాలా రోజులు పట్టింది. ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభిస్తుండడంతో చికెన్ ప్రియులతోపాటు, పౌల్ట్రీ యజమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎలాంటి లక్షణాలు లేకుండా..
ఈ వైరస్ సోనిన కోడిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోవం కూడా కోళ్లు పెద్ద సంఖ్యలో మృతికి కారణమంటున్నారు. ఉదయం ఆరోగ్యంగానే ఉన్న కోళ్లు సాయంత్రానికి సడెన్‌గా చనిపోతున్నాయి. సాయంత్రం ఆరోగ్యంగా ఉంటే.. తెల్లవారేసరికి మృతిచెందుతున్నాయి. ఈ కొత్త, అంతుచిక్కని వైరస్ కోళ్ల గుండెపై ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.