Prabhas : సోషల్ మీడియా మాధ్యమాలలో హీరో ప్రభాస్ అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ప్రభాస్ లైనప్ కి సంబంధించి ఒక కీలక సమాచారం ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం డార్లింగ్ వరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఫ్యాన్ బేస్ విషయంలో ప్రస్తుతం ఉన్న హీరోలలో ప్రభాస్ టాప్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు. ఇక అభిమానుల కోసం డార్లింగ్ స్పీడ్ పెంచబోతున్నారట. ఇప్పటివరకు తాను కమిటైన సినిమాలన్నీ చక చకా పూర్తి చేయనున్నారట ప్రభాస్. తాజాగా ప్రభాస్ లైనప్ కు సంబంధించి ఒక కీలకమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో కల్కి 2898 ఏడి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సొంతం చేసుకుంది. ఇక కల్కి 2898 ఏడి సినిమాకు సీక్వెల్ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ఎప్పటినుంచి అనేది క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి 2898 ఏడి సీక్వెల్ షూటింగ్ జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలిపారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ది రాజా సాబ్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా చేస్తున్నారు. స్పిరిట్, కల్కి 2898 ఏడి,ఫౌజి సినిమాలతో ఒకే సమయంలో బిజీ కాబోతున్నారు ప్రభాస్.
అయితే ఇది అంతా ఈజీ టాస్క్ కాదనే తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమాల విషయంలో ప్రభాస్ స్పీడ్ పెంచడంతో ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 2025, 2026 సంవత్సరంలో వరుసగా ప్రభాస్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తుంది. డార్లింగ్ సినిమాల కోసం పాన్ ఇండియా వైస్ లో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే హీరో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియా వైస్ లో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నవే. దీంతో ఈ సినిమాలపై ప్రేక్షకులలో మరింత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ సినిమా షూటింగ్ పూర్తయి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.