Murali Naik: పెహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులను మనమంతా చూస్తూనే ఉన్నాం. ‘ఆపరేషన్ సింధూర్'(#OperationSindhoor) పేరిట మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మనపై ఎన్నో దాడులు చేసింది. ఎన్నో మిస్సైల్స్, థ్రోన్స్ ని వదిలింది. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూమిని తాకలేకపోయిందంటే అందుకు కారణం మన ఇండియన్ ఆర్మీ పోరాటమే. ఈ పోరాటం లో మురళీ నాయక్(Murali Nayak) వంటి సైనికులను కూడా కోల్పోయాము. సరిగ్గా 23 సంవత్సరాలు కూడా నిండని మురళీ నాయక్ ఇండియన్ ఆర్మీ లోకి అడుగుపెట్టి ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే సెలవుల కోసం ఇంటికి వచ్చిన మురళి ని ఆర్మీ చీఫ్ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా తిరిగి రమ్మని ఆదేశించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లిన మురళి నాయక్, ఇలా విగతజీవిగా ఇంటికి తిరిగొచ్చాడు.
Also Read: ఏపీ ప్రజలకు ‘జూన్’ ఉపశమనం.. ఆపద సమయాన్ని గట్టెక్కిస్తున్న ప్రభుత్వం!
మురళీ నాయక్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి వీరాభిమాని. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన మురళి నాయక్, పవన్ కి సంబంధించిన ప్రతీ విషయాన్నీ గొప్పగా పండుగలా చేసుకునేవాడు. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా, ఎర్ర తువ్వా తలకు చుట్టుకొని, జనసేన జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగాడు. అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. జీవితం లో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ ని కలవాలని అతని కోరిక. ఆ కోరిక తీరకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నేడు మురళి నాయక్ అంత్యక్రియలు సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కార్యక్రమం లో పాల్గొన్నాడు. అతని గురించి గొప్పగా మాట్లాడుతూ జయహో మురళి నాయక్ అంటూ నినాదాలు చేసాడు. మురళీ నాయక్ తండ్రి పవన్ కళ్యాణ్ ని చూసిన వెంటనే బోరుమని ఏడుస్తూ విలపించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
‘నువ్వు ఎంతగానో ఇష్టపడే పవన్ కళ్యాణ్ సార్ నీకోసం వచ్చి ఇక్కడ కూర్చున్నాడు రా..పైకి లెయ్యి మురళీ’ అంటూ ఆ తండ్రి బోరుమని విలపిస్తూ ఏడ్చిన వీడియో ని చూస్తే ఎలాంటి వారికైనా కన్నీళ్లు రాక తప్పదు. ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు. అయితే సోషల్ మీడియా లో మురళీ నాయక్ ని తలచుకొని చావు అంటే ఇలా ఉండాలి రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 23 ఏళ్ళ వయస్సు కూడా లేని ఒక కుర్రాడి పార్థివ దేహాన్ని చూడడం కోసం వేలాది మంది తరలి వచ్చారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు అతని కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దగ్గర నుండి చూస్తే చాలు అని అనుకున్న తన అభిమాన హీరో తనని చూడడం కోసం వచ్చి, జయహో మురళీ అని నినాదాలు చేసేలా చేసాడు, ఎంత మందికి ఇలాంటి జన్మ ఉంటుంది చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
— Prasannakumar Nalle (@PrasannaNalle) May 11, 2025