Mudragada Padmanabha Reddy: పవన్ సినిమాలు వదిలేయాలట.. ఫిట్టింగ్ పెట్టేశాడే!

మొన్న ఆ మధ్యన మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ.. అన్నట్టుగానే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సెలవిచ్చారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 11:02 am

Mudragada Padmanabha Reddy

Follow us on

Mudragada Padmanabha Reddy: పవన్ అంటే ముద్రగడకు ఎందుకంత కోపం. తనను జనసేనలో చేర్చుకోలేదనా? లేకుంటే తనను కాదని కాపుల ఆరాధ్య దైవంగా మారారనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పవన్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపధం చేసింది ఆయనే. తనను తాను తక్కువ చేసుకుంది ఆయనే. చివరకు పేరు మార్చుకుంది ఆయనే. అక్కడితో ఈ వివాదాన్ని విడిచిపెట్టడం లేదు. పవన్ ముందు ఏవేవో డిమాండ్లు పెడుతున్నారు. వాటిని చేయాల్సిందేనని కండిషన్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవే హాట్ టాపిక్ గా మారాయి.

మొన్న ఆ మధ్యన మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ.. అన్నట్టుగానే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సెలవిచ్చారు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అటు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారింది.అయితే పవన్ కాపులకు రిజర్వేషన్లు తేవాలని ఒకసారి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మరోసారి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించాలని ఇంకోసారి.. ఇలా లేనిపోని డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. తాను చాలా అసమర్థుడునని.. అందుకే కాపు రిజర్వేషన్లు తేలేకపోయానని తన అసమర్ధతను బయటపెడుతున్నారు. ఎవరు అడగకుండానే, డిమాండ్ చేయకుండానే పేరు మార్చుకున్న ఆయన.. పవన్ కు సరికొత్త కండిషన్లు పెడుతుండడం విశేషం.

నిన్నటికి నిన్న తన కుటుంబాన్ని వేధిస్తున్నారని.. పవన్ తో పాటు అభిమానులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు పెద్దాయన. అలా ఇబ్బంది పెట్టే కంటే తన కుటుంబ సభ్యులు ఏడుగురు చంపేయాలని కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. మరోసారి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం ఆపేయాలని కోరారు. అప్పట్లో ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత సినిమాలు తీయడం మానేశారని.. న్యాయస్థానాల అనుమతితో తర్వాత సినిమాల్లో నటించిన విషయాన్ని ముద్రగడ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అదే పని చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సేవలో ఉన్నవారు సినిమాల్లో నటించకూడదన్న సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు ముద్రగడ. అయితే ముద్రగడ తీరును చూస్తుంటే ఆయన పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకున్నట్టు ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా పవన్ పైనే ముద్రగడ మాట్లాడుతుండడం విశేషం. దీనిపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు.