https://oktelugu.com/

AP Assembly Session 2024: ఇద్దరు బద్ధ శత్రువులు జగన్, పవన్ కలిసిన సీన్ చూడాల్సిందే

గత ఎన్నికల్లోపవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.దీంతో గత ఐదేళ్లుగా పవన్ ఎన్నో రకాల అవమానాలు పడ్డారు వైసీపీ నేతలు నుంచి. ఈ ఎన్నికల్లో జగన్ పాతాళంలోకి తొక్కేయకుంటే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదని పవన్ ప్రతిన బూనారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 22, 2024 10:43 am
    AP Assembly Session 2024

    AP Assembly Session 2024

    Follow us on

    AP Assembly Session 2024: ఎందుకో జగన్ అంటే పవన్ కు నచ్చదు. పవన్ అన్న జగన్ కు చిన్నచూపే.జనసేన ఆవిర్భావం నుంచి జగన్ అంటే పవన్ కు నచ్చదు.2014లో జనసేన ఆవిర్భవించింది.కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు పవన్.అప్పట్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి జగన్ సైతం పవన్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో కలిసి పోటీ చేయడం వెనుక చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికేనని జగన్ అనుమానించారు. 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో జగన్ గెలిచేసరికి పవన్ చిన్న మనిషిగా కనిపించారు. రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా.. పవన్ వ్యక్తిగతంగా టార్గెట్ అయ్యేవారు.

    గత ఎన్నికల్లోపవన్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.దీంతో గత ఐదేళ్లుగా పవన్ ఎన్నో రకాల అవమానాలు పడ్డారు వైసీపీ నేతలు నుంచి. ఈ ఎన్నికల్లో జగన్ పాతాళంలోకి తొక్కేయకుంటే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదని పవన్ ప్రతిన బూనారు. మూడు పార్టీలు కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాటులో, ఓట్ల బదలాయింపులో పవన్ కీలకంగా వ్యవహరించారు. కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ దక్కడం లో సైతం పవన్ దే కీలక పాత్ర. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ఎంతటి భారీ ఓటమికి పవన్ ప్రధాన కారణం. దీంతో కచ్చితంగా వైసీపీ శ్రేణులకు పవన్ పై కోపం ఉంటుంది.

    ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 175 మంది ఎమ్మెల్యేలుగా నిన్న ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు, పవన్ తో పాటు జగన్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఈ తరుణంలో పవన్ ను ప్రత్యేకంగా కలిశారు జగన్. ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తమ మధ్య ఉన్న వైరాన్ని మరిచి పవన్ తో చేయి కలిపారు. పవన్ సైతం అదే ఆప్యాయతతో పవన్ శుభాకాంక్షలు స్వీకరించారు. ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయాల్లో ఈ హుందాతనం కొనసాగాలని ఎక్కువ మంది ఆకాంక్షించారు.