https://oktelugu.com/

Nara Lokesh : నారా లోకేష్ చేసిన పనికి ఫిదా.. మాతృమూర్తి భావోద్వేగం వైరల్!

నారా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు లోకేష్ చేసిన పనికి ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 8, 2024 / 12:00 PM IST

    Mother Nara Bhuvaneshwari's emotion

    Follow us on

    Nara Lokesh : పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటే తల్లిదండ్రులు పులకించుకుపోతారు. మంచి పనులు చేస్తే అభినందిస్తారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అలానే చేశారు. ఉత్రోత్సాహంతో సంతోషం వ్యక్తం చేశారు. వెల్డన్ లోకేష్ అంటూ కుమారుడిని పొగడ్తలతో ముంచెత్తారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ఈ సమావేశాలు జరిగాయి. కార్యక్రమంలో భాగంగా బాపట్లలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సమావేశానికి సీఎం చంద్రబాబు, పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులతో మమేకమయ్యారు. తల్లిదండ్రులతో సమావేశం అయ్యారు. కార్యక్రమం ఆధ్యాంతం ఆసక్తికరంగా మారింది. తండ్రి చంద్రబాబు చెంతనే కుమారుడు లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. వారిద్దరూ పిల్లలతో కలిసి మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే చేశారు.

    * తండ్రి పక్కనే కూర్చుని.. ప్లేటు తీసి
    అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగు చూసింది. సీఎం చంద్రబాబు పక్కనే లోకేష్ కూర్చొని సహపంక్తి భోజనం చేశారు. తండ్రి భోజనం చేసిన ప్లేటును స్వయంగా నారా లోకేష్ తీశారు. లోకేష్ తన భోజనం అయిపోయిన తర్వాత.. తన ప్లేటు తో పాటు సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేట్లు కూడా ఎత్తారు. ఎంతలో సహాయకురాలు రావడంతో ఆమెకు ఆ రెండు ప్లేట్లు, గ్లాసులు అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన నారా లోకేష్ తల్లిభువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడు లోకేష్ ను అభినందించక ఉండలేకపోయారు. కుమారుడిని ప్రశంసలతో ముంచెత్తారు.

    * ట్వీట్ వైరల్
    భువనేశ్వరి తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.’ చంద్రబాబు గారు భోజనం చేసిన ప్లేట్లు తీసుకుని శుభ్రపరిచే ప్రయత్నం చేయడం నీ ఆలోచనత్మకమైన దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. భోజన అనంతరం శుభ్రం చేస్తున్న పాఠశాల సిబ్బందికి సాయపడడం బాగుంది. తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెబుతున్నాయి. నిత్యం మనకు సహాయకారిగా ఉండే పనివాళ్ళు పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టం చేశావు. నిజంగా ఇది స్ఫూర్తిదాయక విషయం’ అంటూ కుమారుడిని ప్రశంసలతో కూడిన అభినందనలు తెలిపారు భువనేశ్వరి. సోషల్ మీడియాలో ఈ పోస్టుకు విపరీతమైన లైకులు వస్తుండడం విశేషం.