https://oktelugu.com/

Krishna Dist: ఆడబిడ్డని 12 రోజుల పసిబిడ్డ హత్య

మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీకవి. చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడిన తల్లి మాత్రం ఉండదు. కానీ ఇక్కడ ఓ తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డను తానే చిదిమేసింది. కాపాడాల్సిన రెప్ప కాటు వేసింది. 12 రోజుల పసిపాపను నీటితొట్టిలో పడేసి తనలోని కర్కశత్వాన్ని నిరూపించుకుంది. కన్నవారికి ఏదైనా జరిగితే అల్లాడిపోయే తల్లే తన ప్రాణాలు తీస్తుందని తెలియని పసికందు బాధ ఎవరికి తెలుసు. ఊపిరి ఉన్నంత వరకు ఊసులాడే తల్లి మనసు ఇంత […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 15, 2021 1:32 pm
    Follow us on

    Mother Murdered Her child

    మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు అన్నారో సినీకవి. చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ చెడిన తల్లి మాత్రం ఉండదు. కానీ ఇక్కడ ఓ తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డను తానే చిదిమేసింది. కాపాడాల్సిన రెప్ప కాటు వేసింది. 12 రోజుల పసిపాపను నీటితొట్టిలో పడేసి తనలోని కర్కశత్వాన్ని నిరూపించుకుంది. కన్నవారికి ఏదైనా జరిగితే అల్లాడిపోయే తల్లే తన ప్రాణాలు తీస్తుందని తెలియని పసికందు బాధ ఎవరికి తెలుసు. ఊపిరి ఉన్నంత వరకు ఊసులాడే తల్లి మనసు ఇంత దారుణంగా మారుతుందా అని అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. కన్న తల్లి అయినా కఠోర మనసును అందరిని కలచివేస్తోంది.

    కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామానికి చెందిన కలపాల నాగేశ్వర్ రావు కుమారుడు హరికృష్ణ కు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహం జరిగింది. వ్యవసాయం చేసుకుంటూ జీవించే వీరికి చాలా కాలం తర్వాత సీతామహాలక్ష్మి గర్భం దాల్చింది. ప్రసూతి కోసం ఏలూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా జులై 30న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండడడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. కానీ బిడ్డ అనారోగ్యంగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి గొంతు ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు గుర్తించి చికిత్స చేసి పంపించారు.

    ఈ నేపథ్యంలో ఈ నెల 11న ఆస్పత్రి నుంచి వెళ్లొచ్చని వైద్యులు తెలిపారు. హరికృష్ణ బయటకు వెళ్లి తండ్రితో కలిసి ఆస్పత్రికి వచ్చే సరికి పాప కనిపించలేదు. దీంతో ఆస్పత్రి అంతా గాలించినా ఫలితం లేదు. చివరిి పాప ఆస్పత్రిలోని నీటితొట్టిలో శవమై కనిపించింది. దీంతో టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ ఆదిప్రసాద్, ఎస్సైలు కిషోర్ బాబు, నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై తల్లిని ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్లు సీతామహాలక్ష్మి ఒప్పుకుంది.

    సీతామహాలక్ష్మికి ఆడబిడ్డ పుట్టడం ఇష్టం లేదు. దీనికి తోడు బిడ్డ అనారోగ్యంతో పుట్టడంతో అసలు నచ్చక పాపను తొట్టిలో పడవేసినట్లు చెప్పింది. ఏలూరు డీస్పీ దిలీప్ కిరణ్ నిందితురాలిని న్యాయమూర్తి ఎదుట మాజరు పరచగా రిమాండ్ విధించారు. కన్నబిడ్డను కడతేర్చిన తల్లిని అందరు అసహ్యించుకున్నారు. సభ్య సమాజానికే మచ్చ తెస్తున్న ఇలాంటి తల్లులు ఉండడం మన దురదృష్టమని అందరు చీదరించుకున్నారు.