Trivikram: పవన్ తో చేయడం మహేష్ కి నచ్చట్లేదు !

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. ఇప్పుడు ఇదే మహేష్ బాబుకి నచ్చడం లేదు. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా పాన్ ఇండియా లెవల్లో సినిమా చేద్దాం అంటూ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ బడ్జెట్ పెటిస్తున్నాడు. మరోపక్క సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ కోరిన […]

Written By: admin, Updated On : August 16, 2021 10:57 am
Follow us on

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ భీమ్లా నాయక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు. ఇప్పుడు ఇదే మహేష్ బాబుకి నచ్చడం లేదు. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాని మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా పాన్ ఇండియా లెవల్లో సినిమా చేద్దాం అంటూ ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ బడ్జెట్ పెటిస్తున్నాడు.

మరోపక్క సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ కోరిన మార్పులను ఇంకా త్రివిక్రమ్ పూర్తి చేయలేదు. పైగా పవన్ కళ్యాణ్ కోసం కొత్తగా ఓ స్క్రిప్ట్ రాస్తున్నాడు త్రివిక్రమ్. బీమ్లా నాయక్ కు మాత్రమే స్క్రిప్ట్ వర్క్ చేయడానికి మహేష్ అంగీకరించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో సినిమాకి కూడా స్క్రిప్ట్ ఎందుకు రాస్తున్నాడు అనేది మహేష్ అసంతృప్తి.

తనతో సినిమా చేస్తూ.. తన సినిమా పై ఫోకస్ చేయకుండా వేరే సినిమాల పై వర్క్ చేయడం ఏమిటి అనేది మహేష్ పాయింట్. అయితే, త్రివిక్రమ్ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తి చేయడానికి మరో మూడు నెలలు టైం పడుతుంది.

కాబట్టి ఆ సినిమా పూర్తి అయ్యే లోపు త్రివిక్రమ్ పవన్ సినిమాలకు పని చేయాలనుకుంటున్నాడు. ఎలాగూ కథ మాటలు రాసినందుకు త్రివిక్రమ్ నాలుగు కోట్లు తీసుకుంటాడు. మరి నాలుగు కోట్లు అంటే మాటలు కాదు కదా. అందుకే, త్రివిక్రమ్ పవన్ సినిమాల స్క్రిప్ట్ ల పై కూర్చుంటున్నాడు.

మహేష్ కి మాత్రం ఇది నచ్చట్లేదు. ఆ మూడు నాలుగు నెలలు ఏదో తనతో చేయబోయే సినిమా కథ పై కూర్చుంటే.. తన సినిమా బాగా వస్తోంది కదా అని మహేష్ ఫీల్ అవుతున్నాడు. కానీ, త్రివిక్రమ్ మాత్రం పక్కా లెక్కలతో ముందుకు వెళ్తున్నాడు.