https://oktelugu.com/

Mohan Babu Family : టిడిపిలోకి మోహన్ బాబు ఫ్యామిలీ? తెర వేరే వెనుక ఏం జరిగుతోందంటే?

టిడిపికి సినీ గ్లామర్ ఎక్కువ. ఎన్టీఆర్ హయాంలో అయితే సినీ గ్లామర్ తో ఆ పార్టీ నిండుగా కనిపించేది. ముఖ్యంగా మోహన్ బాబు యాక్టివ్ రోల్ ప్లే చేశారు. కానీ చంద్రబాబుతో విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే మంచు కుటుంబం టిడిపికి దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Written By: , Updated On : November 30, 2024 / 05:52 PM IST
Mohan Babu Family

Mohan Babu Family

Follow us on

Mohan Babu Family : తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు మోహన్ బాబు. పార్టీ తరఫున ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. అయితే చంద్రబాబుతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి టిడిపి తో పాటు చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసేవారు. అయితే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు మోహన్ బాబు. అప్పట్లో మోహన్ బాబు కుటుంబానికి చెందినవారు టిడిపి నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ ప్రారంభం అయ్యింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు సానుకూల ప్రకటనలు ఇస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు మోహన్ బాబు కుమారుడు మనోజ్ హాజరయ్యారు. తాజాగా మరో కుమారుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. కీలక చర్చలు జరిపారు. తన సోదరుడు, డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్ తో చర్చలు విజయవంతమయ్యాయి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. రకరకాల చర్చకు కారణమవుతోంది. ఇన్ని రోజులు చంద్రబాబుకు దూరంగా ఉండే కుటుంబం.. ఇప్పుడు ఎందుకు దగ్గరవుతోందన్నది చర్చ.

* జగన్ కు మద్దతు
వైయస్ జగన్ తో మంచు మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. జగన్ చిన్నాన్న కుమార్తె విష్ణు భార్య. దీంతో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు మోహన్ బాబు. చంద్రబాబును వ్యతిరేకించే మోహన్ బాబు జగన్ కు దగ్గరయ్యారు. 2018లో అయితే ఏకంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తిరుపతిలో ఆందోళనకు దిగారు. చంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు మోహన్ బాబు. అయితే ఆ ఎన్నికల్లో జగన్ గెలిస్తే తనకు తిరుగు లేదని భావించారు మోహన్ బాబు. కానీ గత ఐదేళ్లుగా మోహన్ బాబును జగన్ పట్టించుకోలేదు. ఎటువంటి పదవి కేటాయించలేదు. దీంతో మోహన్ బాబు సైతం జగన్ కు దూరమయ్యారు. చంద్రబాబుకు దగ్గరయ్యారు.

* క్రమేపి బాబుకు దగ్గరగా
ఏపీలో కూటమి గెలిచిన వెంటనే మోహన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎన్నికలకు ముందే తాను లోకేష్ కు వ్యతిరేకంగా మంగళగిరిలో ప్రచారం చేయడంపై క్షమాపణలు కోరుకున్నారు. మా ఎన్నికల్లో మోహన్ బాబుకు బాలకృష్ణ మద్దతు తెలిపిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత చంద్రబాబును కలిశారు కూడా. కుటుంబ విషయంలో ఆలోచించడానికి తాను చంద్రబాబును కలిశానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టిడిపి నాయకురాలు భూమా అఖిల ప్రియ సోదరిని మోహన్ బాబు కుమారుడు మనోజ్ వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి మనోజ్ కూడా టిడిపి తో పాటు జనసేన విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేరుగా విష్ణు కూడా నారా లోకేష్ ను కలవడంతో మంచు మోహన్ బాబు కుటుంబం తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.