MLC elections : ఏపీలో( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపాయి. రెండు పట్టభద్రులతోపాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగింది. నిన్న ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. సాయంత్రానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఫలితం వచ్చింది. అక్కడ పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమి చవిచూశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు విజయం వైపు అడుగులు వేశారు. ఇప్పటికే కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిడిపి మద్దతుదారు ఆలపాటి రాజేంద్ర గెలుపొందారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు దగ్గరగా ఉన్నారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కు కొద్ది రోజులు ముందు ఏపీటీఎఫ్ అభ్యర్థికి కూటమి మద్దతు ప్రకటించింది.
Also Read : కూటమికి షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనుకబడ్డ అభ్యర్థి!
అయితే ఎన్నికల్లో చాలా రకాల అంశాలు ప్రభావితం చేస్తాయని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ( graduates MLC elections )సంబంధించి టిడిపి కూటమికి ఎదురు దెబ్బ ఖాయమని ప్రచారం నడిచింది. గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోస్టర్ విధానంపై ఆందోళన చెందారు. ఆ విధానాన్ని రద్దుచేసి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలిపారు. దీంతో కూటమిపై ఈ ప్రభావం చూపుతుందని అంతా భావించారు. కానీ నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు కూటమికి జై కొట్టారు.
* రికార్డ్ స్థాయి మెజారిటీ
ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్( alapati Rajendra Prasad) . రికార్డు స్థాయిలో గెలిచారు. భారీ ఓట్ల తేడాతో నెగ్గారు. ఆయన అభ్యర్థిత్వం విషయంలో కూటమి పార్టీల్లోనే వ్యతిరేకత ఉందని ఒకానొక దశలో ప్రచారం నడిచింది. అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంచనాలు ఉండేవి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేసి కూటమి సూపర్ విక్టరీని అందుకుంది. తనకు తిరుగు లేదని నిరూపించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా.. కూటమి మద్దతుదారుల విజయాన్ని ఆపలేకపోయింది.
* దాదాపు టిడిపి వైపే మొగ్గు
మరోవైపు గోదావరి జిల్లాలకు( Godavari distric సంబంధించి దాదాపు విజేత టిడిపి బలపరిచిన పేరా బత్తుల రాజశేఖర్. ఇంకా ఓటింగ్ కొనసాగుతున్నప్పటికీ.. అత్యధిక ఓట్లు ఆయనే సొంతం చేసుకున్నారు. ఆయన గెలుపు తప్పదని తేలిపోయింది. గోదావరి జిల్లాలో సైతం వివిధ అంశాలు పనిచేస్తాయని.. కూటమికి అక్కడ దెబ్బ పడటం ఖాయమని విశ్లేషణలు ఉండేవి. అక్కడ సైతం విజయం సాధించే దిశలో ఉండడంతో సంబరాలు చేసుకుంటోంది టిడిపి. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు గెలవకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు కూటమి నేతలు. కేవలం బలపరిచామే కానీ తాము నిలబడలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Also Read : ఏపీలో మరో పోరు.. శాసనమండలి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ జారీ!