MLC Elections: తెలంగాణలో మార్చి 31న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate MLc) స్థానం ఒకటి, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ(Teachers MLC) స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. ఇక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ ఉప సంహరణకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలీఇంగ్, మార్చి 3న ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించింది.
ఎన్నికలు జరిగే స్థానాలివీ..
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఖాళీ అయ్యే ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జీవన్‌రెడ్డి, కూర రఘోత్తమ్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏపీలోనూ మూడు..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సెడ్యూల్ విడుదల చేసింది. ఇక్కడ రెండు పట్టభద్రులు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 17న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నిలక సంఘం ప్రకటించింది. ఈమేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఫలితాలు ప్రకటిస్తామని వివరించింది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.