MLA Thomas Tirumala: తిరుమలలో( Tirumala) ప్రజాప్రతినిధుల హవా తగ్గడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్యేలు స్వామివారి దర్శనం విషయంలో పెద్ద ఎత్తున తమ అనుచరులను వెంట తీసుకెళ్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ హల్ చల్ చేశారు. శనివారం స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. నిబంధనల ప్రకారం ఆయనతోపాటు మరో 9 మందికి విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ జారీ చేసింది. అయితే మరో ఆరుగురికి సైతం వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు తన వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే థామస్. టిటిడి సిబ్బంది అడ్డుకోవడంతో తిట్ల దండకం అందుకున్నారు ఎమ్మెల్యే. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపై సైతం రుసరుసలాడారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
* నిబంధనలకు విరుద్ధంగా..
ఎమ్మెల్యే థామస్ తో( MLA Thomas ) పాటు మరో 9 మందికి విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ జారీచేసింది. అలాగే తనతో వచ్చిన మరో ఆరుగురికి వేరే రిఫరెన్స్ లో సాధారణ విఐపి బ్రేక్ టిక్కెట్లు పొందారు. అయితే వీరిని కూడా తనతో పాటు క్యూ కాంప్లెక్స్ 1 లోని.. ప్రోటోకాల్ లైన్లోకి తీసుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో టిటిడిసిబ్బంది అనుమతించలేదు. వారితో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే ఆగ్రహంతో తిట్లకు దిగారు. బలవంతంగా తన అనుచరులను నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్లు తెలిసింది. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ ఈవో, విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారి మీద కూడా ఎమ్మెల్యే థామస్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదం పద్ధతి కాకుండా టిటిడి అధికారులు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
* ఘనంగా పుష్పయాగం..
మరోవైపు తిరుమలలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి( Prasanna Venkateswara Swamy ) వారి ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో జూన్ 7 నుంచి 15 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. అయితే నిత్య కైంకర్యాలు, బ్రహ్మోత్సవాల్లో లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా పుష్ప యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టిటిడి సిబ్బంది పై @JAITDP ఎమ్మెల్యే బూతు పురాణం
తిరుమలలో @TTDevasthanams నిబంధనలను తుంగలో తొక్కిన గంగాధర నెల్లూరు MLA థామస్
తనతో పాటు ఉన్న అనుచరుల అందరిని ప్రోటోకాల్ దర్శనానికి అనుమతించాలని హంగామాతనతో పాటు 12 మందికి ప్రోటోకాల్ కేటాయించిన… pic.twitter.com/KJic4U1bI6
— Jagananna Connects (@JaganannaCNCTS) July 13, 2025