Deputy CM Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు పవన్ బహిరంగ లేఖ!

పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : June 16, 2024 11:04 am

Deputy CM Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan: తనకు ఇష్టమైన శాఖలు లభించడంతో పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చుతానని చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను బాధ్యతలు చేపడతానని.. ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం గా కంటే ఎమ్మెల్యే గానే తాను సేవ చేసేందుకు ఇష్టపడతానని కూడా చెప్పుకొచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పదవిని స్వార్థం కోసం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకునేది లేదని తేల్చి చెప్పారు. తనకు ఇష్టమైన శాఖను కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇంతలో రాష్ట్ర ప్రజలకు సైతం ఆయన బహిరంగ లేఖ రాయడం విశేషం. అటవీ శాఖ మంత్రిగా అటవీ సంపదను దోచుకున్న వారితో సొమ్ములను తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. తన వారాహి యాత్ర సందర్భంగా అనేక సమస్యలను కళ్లారా చూసినట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడం పై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపదగా లభించే ఎర్రచందనాన్ని పరిరక్షించే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని కూడా తేల్చి చెప్పారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందేనని పవన్ హెచ్చరించారు.

తనకు ఎదురైన అనుభవాలను సైతం పవన్ ఈ సందర్భంగా పంచుకున్నారు. విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తున్నప్పుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్లానని.. అక్కడ నీటి కోసం మహిళలు పడే బాధలు చూసానని.. వారి కష్టాలను తొలగించే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. పర్యావరణం జనసేన సిద్ధాంతాల్లో భాగం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. పర్యావరణ మంత్రిగా దానిని పరిరక్షించే బాధ్యత తీసుకుంటా. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. సాంకేతికత లోక కళ్యాణానికి అత్యంత ఆవశ్యం. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేస్తా. పర్యాటక రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాల్లో మెరుగైన వస్తువులు కల్పిస్తాం. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తాం. సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం అందిస్తాం. స్నేహపూరిత వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తామని పవన్ స్పష్టం చేశారు.