Big shock to Maoists : మావోయిస్టులకు( mavoists) వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయారు. అక్కడ కొద్ది రోజులకే తాజాగా మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ సింహాచలం ఎన్కౌంటర్లో మృతి చెందారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సింహాచలం పై కోటి రూపాయల రివార్డు ఉంది. గతంలో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్టు శాంతి చర్చల్లో సింహాచలం కూడా పాల్గొన్నాడు. అయితే తక్కువ రోజుల వ్యవధిలోనే ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం కావడం ఉద్యమానికి తీరని లోటు. అయితే ఈ ఇద్దరు అగ్ర నేతలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం గమనార్హం. ఏపీకి చెందినవారు మావోయిస్టు కేంద్ర నాయకత్వం వహించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే.
* జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ( National democratic allians ) ప్రభుత్వం మావోయిస్టుల ఉనికి లేకుండా చేసేందుకు భారీ ఆపరేషన్లు చేపడుతోంది. చత్తీస్గడ్ తో సహా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది. ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుడు నంబాల కేశవరావు భద్రతా బలగాల ఎన్కౌంటర్లో చనిపోయారు. ఆ ఘటన మరవక ముందే మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీనరసింహచలం అలియాస్ సుధాకర్ చనిపోయినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. సింహాచలం కు చంటి, బాలకృష్ణ, రామరాజు, గౌతమ్, ఆనంద్, సోమన్న అనే పేర్లు కూడా ఉన్నాయి.
Also Read : దెబ్బమీద దెబ్బ.. జగన్ గుర్తున్నాడా? లేఖలు రాసే మావోయిస్టు ఎన్ కౌంటర్.. ఇప్పటికీ 15 మంది
* నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలో..
నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు సింహాచలం( Simhachalam). ఒక సాధారణ సభ్యుడిగా చేరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉన్నారు. సింహాచలం స్వస్థలం ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం. 40 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుకుగా ఉన్న సింహాచలం పై కోటి రూపాయల రివార్డు ఉంది. 2004లో ఏపీ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నాడు. అయితే తాజాగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పట్టాయి. బీజాపూర్ అడవుల్లో ఇంద్రావతి టైగర్ రిజర్వులో మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో సింహాచలం మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు.
* మరికొందరు కీలక నేతలు?
సింహాచలం చనిపోయిన ప్రాంతంలో మరికొందరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్( Bandi Prakash), మావోయిస్టు జోన్ కమిటీ సీనియర్ లీడర్ పాపారావు కూడా అదే ప్రాంతంలో ఉన్నారని సమాచారం వచ్చినట్లు బస్త ర్ ఐజి సుందర్ రాజు తెలిపారు. అయితే వారంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులేనని తెలుస్తోంది. అందుకే భద్రతా బలగాలు అక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే కేవలం మూడు వారాల వ్యవధిలోనే మావోయిస్టులకు మరో భారీ దెబ్బ తగలడంతో కోలుకోలేని పరిస్థితి నెలకొంది.