Divvela Madhuri : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టు అవుతారని టాప్ నడుస్తోంది. వారం రోజుల కిందట ఆయనపైటెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగా ఉండేవారు. చాలాసార్లు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్లకు దిగారు.ఓసారి ఏకంగా చెప్పు చూపించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.ఈ తరుణంలో టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు.గతంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే తక్షణం అరెస్టు చేయాలని కోరారు. ఈ తరుణంలో పోలీసులు పావులు కదిపారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
* పోలీసులను ఆశ్రయించిన మాధురి
మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి ఈ ఘటనపై స్పందించారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే మాధురితో.. పోలీసులకు ఫిర్యాదు చేయించారంటూ కూటమినేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్, మరోవైపు డిప్యూటీ సీఎం పైనే మాధురి ఏకంగా ఫిర్యాదు చేయడం సంచలనానికి కారణం అవుతోంది.
* నాటి కామెంట్స్ పై
వైసిపి హయాంలో జనసేన ను టార్గెట్ చేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. చాలా చులకన చేసి మాట్లాడారు. పవన్ వ్యక్తిగత జీవితంపై కూడామాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రావడం, డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు స్వీకరించడంతో దువ్వాడ శ్రీనివాసులో ఒక రకమైన మార్పు కనిపించింది. తాను ఎవరి జోలికి వెళ్ళనని.. తమ జోలికి జనసైనికులు రాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే తిరుమల సందర్శించిన దువ్వాడ శ్రీనివాస్, మాధురీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మాధురి పవన్ కళ్యాణ్ విషయంలో మరోసారి నోరు జారారు. అప్పటినుంచి జన సైనికులు టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేయడం.. అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం.. ఇంకో వైపు డిప్యూటీ సీఎం పవన్ పై ఏకంగా మాధురి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.