spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Kadapa Tour: లోకేష్ పనికి కడప జిల్లా ప్రజలు ఫిదా!

Nara Lokesh Kadapa Tour: లోకేష్ పనికి కడప జిల్లా ప్రజలు ఫిదా!

Nara Lokesh Kadapa Tour: మంత్రి నారా లోకేష్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయన సామాన్య జనాలతో మమేకం అవుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది. ఆయనలో ఉన్న నాయకత్వాన్ని తెలియజేస్తోంది. ఆయన మంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. పాలనలోను విప్లవాత్మక మార్పులు చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారు. మరోవైపు రాజకీయంగాను రాటు దేలుతున్నారు. అయితే తాజాగా అయిన కడప పర్యటనకు వెళ్లారు. కడప అంటే తెలుసు కదా రాజశేఖర్ రెడ్డి కుటుంబ అడ్డా. అటువంటి చోట కూడా నారా లోకేష్ కు అక్కడి ప్రజలు ఎంతగానో స్వాగతం పలికి.. ఆత్మీయంగా కలిసి పోయారు. నారా లోకేష్ సైతం వారితో మమేకం అయిన తీరు మాత్రం అదుర్స్.

* వ్యవసాయ క్షేత్రం సందర్శన..
జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు మంత్రి నారా లోకేష్. ప్రోటోకాల్ పక్కన పెట్టి ద్వారకానాథ్ రెడ్డి అనే రైతు క్షేత్రాన్ని పరిశీలించారు. చాలా సమయం అక్కడే గడిపారు. రైతు దంపతులు ఆత్మీయంగా లోకేష్ కు స్వాగతం పలికారు. తాము చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి లోకేష్ కు వివరించారు. ప్రతి వివరాన్ని తెలుసుకున్నారు నారా లోకేష్. యువ రైతుకు అభినందనలు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు కడప జిల్లాలో లోకేష్ పై బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇదే జిల్లాకు చెందిన వారైనా.. తమ వాడు అని కడుపులో పెట్టుకున్నా.. లోకేష్ మాదిరిగా ఆత్మీయత చూపిన సందర్భాలు లేవని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు.

* జగన్ తో పోలిక..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే కడప జిల్లాలో ప్రత్యేక గౌరవం. దానికి కారణం జగన్ కాదు. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి కాదు. వన్ అండ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి. పేదల కోసమే ఆయన వైద్య వృత్తి తీసుకున్నారు. ప్రజలతో మమేకమై పని చేసేవారు. వారికి ఆప్యాయత పంచేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే మాదిరిగా వ్యవహరించిన సందర్భం లేదు. అయితే రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని ఆరాధించారు కడప జిల్లా ప్రజలు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థులను సైతం అలానే చూసేవారు. ఈ క్రమంలో చంద్రబాబుపై భిన్నాభిప్రాయం ఉండేది. లోకేష్ పై సైతం వేరు వేరు అభిప్రాయాలు ఉండేవి. కానీ గత రెండేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు చూస్తున్నారు. అయితే లోకేష్ కడప జిల్లాకు వచ్చి సామాన్యులతో మమేకం అవుతున్న తీరు అక్కడి ప్రజలను ఆకట్టుకుంటుంది. గతంలో జగన్ ఎన్నడూ ఇటువంటి వి చెయ్యలేదని.. తాము గుండెల్లో పెట్టుకోవడమే కానీ.. అంటూ పెదవి విరుస్తున్నారు కడప ప్రజలు. లోకేష్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper