Nara Lokesh : సీనియర్లకు షాకిచ్చిన లోకేష్.. మహానాడు వేదికగా కీలక నిర్ణయం

లోకేష్ ప్రసంగ శైలిలో గణనీయమైన మార్పు వచ్చింది. గత ఏడాది ఒంగోలు మహానాడు కంటే ఈ సారి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. పార్టీలో తాను ఒక సాధారణ నాయకుడిగా చెప్పుకున్న లోకేష్ చంద్రబాబు తరువాత నిర్ణయాలు తనవేనన్న సంకేతాలు ఇవ్వగలిగారు.

Written By: Dharma, Updated On : May 28, 2023 1:59 pm
Follow us on

Nara Lokesh : ఇప్పుడు పార్టీలో  నంబర్ 2 స్థానం ఎవరిది? టీడీపీలో తలెత్తుతున్న ప్రశ్న ఇది. అయితే చాలా మంది నాయకులే ఉన్నారు. రెండు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు పొలిట్ బ్యూరో  సభ్యులు ఉన్నారు. కానీ కేడరు ఎవర్నీ చూపించే సాహసం చేయడం లేదు. ఇందుకు యువనేత నారా లోకేషే కారణం. పాదయాత్ర తరువాత లోకేష్ ఇమేజ్ పార్టీలో పెరిగింది. పార్టీ కోసం కష్టపడి పనిచేయడంలో ఇప్పుడు లోకేష్ ముందు వరుసలో ఉన్నారు. పట్టుదలగా వేసవి ఎండలలో సైతం పాదయాత్ర చేసిన లోకేష్ టీడీపీ కోసం ఎందాకైనా అన్నట్లుగా క్యాడర్ ని మెప్పించారు. దీంతో సహజంగానే నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించేశారు. రాజమండ్రి మహానాడు వేదికగా లోకేష్ అద్భుతమైన ప్రసంగం చేశారు.  బాధ్యతాయుతమైన స్పీచ్ ఇచ్చారు. కఠిన నిర్ణయాలను సైతం ప్రకటించారు.

టీడీపీలో తాను ఒక సామాన్య నాయకుడినని చెప్పుకున్న లోకేష్ .. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో హైకమాండ్ కఠినంగా ఉంటుందని సంకేతాలిచ్చారు.  పని చేసే వారికే టికెట్లు అని ఆయన కుండబద్ధలు కొట్టారు. అది తనతో సహా అందరికీ వర్తిస్తుందని కూడా చెప్పుకొచ్చారు.  అయితే పక్కా సమాచారంతోనే ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం చాలా మందిని ఇన్ చార్జులుగా ఉన్నారు. వారంతా తామే ఎమ్మెల్యే అభ్యర్థులం అని భావిస్తున్నారు. ఇపుడు వారి1 ఆశల మీద లోకేష్ నీళ్ళు చల్లేశారు. ఇన్ చార్జిలు అని చెప్పినంతమాత్రాన వారికే టికెట్లు ఇవ్వమని… అసలు ఆ రూలే లేదని చెప్పడంతో ఆశావహుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. కొందరికైతే డౌట్లు కూడా ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం కొందరు సీనియర్లు, మాజీ మంత్రుల వ్యవహార శైలిపై అనుమానాలున్నాయి. వారు పెద్దగా పార్టీలో యాక్టివ్ కాలేదు. అధికారపక్షానికి భయపడి కొందరు, ఖర్చుకు వెనుకాడి కొందరు..పార్టీ తమను అధిగమించి వెళుతుందా? అని మరికొందరు కేడర్ ను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కనీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాల్లో సైతం పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పెరగడం, జనసేనతో దాదాపు పొత్తు కుదరడంతో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. సెడన్ గా నియోజకవర్గాల్లో ప్రత్యక్షమవుతున్నారు. తమకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటి వారికి లోకేష్ చెక్ చెప్పారు.

లోకేష్ ప్రసంగ శైలిలో గణనీయమైన మార్పు వచ్చింది. గత ఏడాది ఒంగోలు మహానాడు కంటే ఈ సారి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. పార్టీలో తాను ఒక సాధారణ నాయకుడిగా చెప్పుకున్న లోకేష్ చంద్రబాబు తరువాత నిర్ణయాలు తనవేనన్న సంకేతాలు ఇవ్వగలిగారు. లోకేష్ విషయంలో చంద్రబాబులా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పోనీలే అన్న తీరు ఉండదని అంటున్నారు. ఆయన కచ్చితంగా ఉంటారని చెబుతున్నారు. పనిచేయని వారికి పదే పదే ఒకే నియోజకవర్గంలో ఓడుతున్న వారికీ టికెట్లు ఇవ్వమని లోకేష్ చెప్పారంటే అంది అక్షరాలా జరిగి తీరుతుంది అంటున్నరు. ఆయన  జోక్యం సలహా లేకుండా ఈసారి టీడీపీ లిస్ట్ బయటకు రాదు కాబట్టి ఆయన మాటలే ఫైనల్ అనుకోవాల్సి ఉంటుదని భావిస్తున్నారు.  మొత్తానికైతే లోకేష్ పార్టీలో సీనియర్లకు గట్టి షాకే ఇచ్చారు.