https://oktelugu.com/

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ కు ఫస్ట్ సినిమా హీరోయిన్ల విషయం లో ఒక బ్యాడ్ రికార్డ్ ఉంది… మరి జాన్వీ కపూర్ పరిస్థితి ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళ నటనలో వైవిధ్యాన్ని చూపించడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు...అందులో జూనియర్ ఎన్టీయార్ మొదటి స్థానం లో ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 23, 2024 / 10:36 AM IST

    Junior NTR(2)

    Follow us on

    Junior NTR: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాను పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆయన దానికి తగ్గట్టుగానే సినిమాలను చేస్తూ దానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడానికి ఆయన అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల పాటు కష్టపడుతూ వచ్చాడు. ఈ సినిమా కోసమే ఆయన చాలావరకు మిగతా సినిమాలను కూడా వదిలేసుకొని ఈ ఒక్క సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ సినిమా రిజల్ట్ కోసం ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనే విషయం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం నటుడిగా మంచి గుర్తింపు వస్తుంది అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అతనితో మొదటి సినిమా చేసిన ఏ హీరోయిన్ కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఇక ఆది సినిమాలో ఎన్టీయార్ పక్కన హీరోయిన్ గా చేసిన కీర్తి చావ్లా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన కూడా ఆమె హీరోయిన్ గా రాణించలేకపోయింది. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన గజాల కూడా ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా అయితే మారలేకపోయింది.

    కాబట్టి ఇప్పుడు జాన్వీ కపూర్ దేవర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. కాబట్టి ఈమె పరిస్థితి ఎలా ఉండబోతుంది మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దాంతో జాహ్నవి కపూర్ కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అని కొంతవరకు భయపడుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో ఆమె సక్సెస్ ని సాధిస్తే మాత్రం వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి.

    మరి ఈ సినిమా తేడా కొడుతుందా? లేదంటే సూపర్ సక్సెస్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక జాన్వీ కపూర్ కెరియర్ మొత్తం ఈ సినిమా మీదనే డిపెండ్ అయి ఉండడం విశేషం… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…