Liquor Scam Bhaskar Reddy Assets: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో కీలక పరిణామం. ఇప్పటివరకు అరెస్టుల పర్వం నడిచింది. ఇప్పుడు ఆస్తుల అటాచ్ ప్రారంభం అయింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ముతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పై రాగా.. ప్రభుత్వం ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో కేసులో ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం ఈ కేసులో ఏ 38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. సూత్రధారి రాజ్ కసిరెడ్డి దొరికిన తరువాత ఒక్కొక్కరు అరెస్టు అయ్యారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి వంటి వ్యక్తులు అరెస్టయ్యారు. భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అయితే ఇందులో కీలక వ్యక్తులకు బెయిల్ లభించింది. కానీ సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం బెయిల్ లభించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన రూ.65 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ కు ప్రభుత్వం అనుమతించడం మాత్రం షాకింగ్ పరిణామమే.
Also Read: ఒకరు కదలరు.. మరొకరు వెళ్ళరు.. వైసీపీలో ఆ మాజీ మంత్రులకు కష్టమే!
మారిన వ్యవహార శైలి..
మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నాటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy) వ్యవహార శైలి విచిత్రంగా ఉంది. తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని లోకేష్ తో పాటు చంద్రబాబుపై ఆయన మండిపడుతున్నారు. చాలాసార్లు అనారోగ్యం పేరుతో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. చాలాసార్లు వైద్య పరీక్షలు జరిపి తిరిగి జైలులో హాజరు పరిచారు. అసలు తన తప్పేమీ లేదని.. తనను అక్రమంగా ఇరికించారని.. ఇరికించిన అధికారులను విడిచి పెట్టనని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరి లెక్కలు తేల్చుతానని కూడా శపధం చేశారు. కోర్టు నిబంధనలను అధిగమించి వ్యాఖ్యానాలు కూడా చేశారు. అయితే పక్కా ఆధారాలతోనే ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: మళ్లీ వారం వారం కోర్టుకు జగన్?!
మద్యం కుంభకోణం నగదు అలా..
వైసీపీ ( YSR Congress)హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉండేవారు. ఓవైపు చంద్రగిరి ఎమ్మెల్యే గా ఉంటూనే తుడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్మును 2024 ఎన్నికల్లో వినియోగించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఇలా వచ్చిన నగదును వైసీపీ అభ్యర్థులకు పంచిన బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించినట్లు సమాచారం. అయితే మద్యం కుంభకోణంలో వచ్చిన నగదుతో 65 కోట్ల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి కోరినట్లు సమాచారం. అయితే దర్యాప్తు బృందం విచారణలో తేలడంతో ప్రభుత్వం సైతం అందుకు అంగీకరించింది. దీంతో భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్ తప్పదని తేలిపోయింది.