https://oktelugu.com/

AP Liquor Sale  : గణనీయంగా మద్యం అమ్మకం .. తగ్గిన ప్రభుత్వ ఆదాయం.. కారణం అదే!

 ఎక్కడైనా మద్యం అమ్మకాలు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 27, 2024 / 11:34 AM IST

    AP  Liquor sales

    Follow us on

    AP Liquor Sale  :  ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ప్రతి షాపు మద్యం స్టాక్ తో కళకళలాడుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం పాలసీని మార్చిన సంగతి తెలిసిందే.అప్పటివరకు ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది.ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,336 మద్యం దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పాత ప్రీమియం బ్రాండ్ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా 99 రూపాయల మద్యం బ్రాండ్ల హవా కొనసాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న అమ్మకాల్లో సింహభాగం వాటిదే.అయితే తక్కువ ధర మద్యం అమ్మకాలు పెరిగి.. ఎక్కువ ధర మద్యం అమ్మ కాలు స్థిరంగా కొనసాగుతుండడంతో.. ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం దక్కడం లేదు. అటు షాపుల యజమానులకు సైతం పెద్దగా లాభాలు రావడం లేదు.
    * రూ.99 మద్యానికి డిమాండ్
     తాము అధికారంలోకి వస్తే పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి తేవడంతో పాటు రూ. 99 కే క్వార్టర్ మద్యం అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని మద్యం బ్రాండ్లకు సంబంధించి రూ. 99కే అందిస్తున్నారు. అయితే ఈ తరహా  మద్యానికి వస్తున్న డిమాండ్లతో.. మిగతా కంపెనీలు సైతం 99 రూపాయలకే అందించేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే తక్కువ ధర మద్యం అమ్మకాలు పెరగడంతో ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో షాపుల లైసెన్సీల ఆదాయం కూడా తగ్గుతోంది. ప్రస్తుతానికి వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మాత్రమే అమ్మకాలు సాగుతున్నాయి. ప్రధానంగా 99 రూపాయల మద్యానికి వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఉన్నట్లు మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
     * పడిపోతున్న ఆదాయం
     ప్రస్తుతం ప్రతినెలా మద్యం సగటున 30 లక్షల కేసుల వరకు అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు మద్యం షాపుల ఏర్పాటు నుంచి వీటి అమ్మకాలు క్రమేపి పెరుగుతున్నాయి. అయితే ఈ 30 లక్షల కేసుల్లో 99 రూపాయల మద్యానికి సంబంధించి కేసులు ఎనిమిది లక్షలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  గతంలో చీప్ లిక్కర్ ఉన్నా ఈ స్థాయిలో ఎప్పుడు కనిపించలేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ 99 రూపాయల మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మరిన్ని మద్యం కంపెనీలు ఈ 99 రూపాయల బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. కానీ వీటి అమ్మకాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం లేదు. రూ. 200 రూపాయలు ఉన్న సీసా అమ్మితే ప్రభుత్వానికి 170 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. 99 రూపాయల మద్యం సీసామితి అందులో సగం మాత్రమే ఆదాయం లభిస్తుంది.ఈ లెక్కన పేరుకే మద్యం విక్రయాలు పెరిగాయి కానీ.. ఆదాయం మాత్రం సమకూరడం  లేదన్నది వాస్తవం.