Homeఆంధ్రప్రదేశ్‌AP Pensions: ఏపీలో వారందరికీ పింఛన్లు.. లేటెస్ట్ అప్డేట్!

AP Pensions: ఏపీలో వారందరికీ పింఛన్లు.. లేటెస్ట్ అప్డేట్!

AP Pensions: ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఈ పింఛన్లకు సంబంధించి అర్హులకు నిలిపివేయమని స్పష్టం చేసింది. అర్హులందరికీ సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తామని చెప్పింది. కొద్దిరోజుల కిందట ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి అనర్హుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా కొందరికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. వైకల్యానికి సంబంధించిన వారికి, ఆరోగ్యంగా ఉండి కూడా 15000 రూపాయలు పొందుతున్న వారికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే రికార్డు స్థాయిలో 2801 మందికి పింఛన్ రద్దు నోటీసులు అందించారు. అయితే వీరికి వైకల్యం నిర్ధారణకు గాను అపీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలా ఆపీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ అందిస్తారు. సచివాలయాల ద్వారా నోటీసులు అందుకున్న వారికి పింఛన్లు నిలిపివేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందారు. సెప్టెంబరులో పింఛన్ ఆగిపోతుందేమోనని భయపడ్డారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అర్హులైన వారిలో ఒక్కరికి కూడా పెన్షన్ ఆపబోమని.. అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.

Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే

* బోగస్ పింఛన్లపై ఫోకస్..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోగస్ పింఛన్ల పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసింది. ఇందుకు గాను వైద్య బృందాలను నియమించింది. సామాజిక పింఛన్ల కింద నెలకు 4 వేల రూపాయల చొప్పున పింఛన్ అందిస్తున్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగులకు సంబంధించి రూ.6000, రూ.10000, రూ.15000 చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరందరికీ నేరుగా ఇళ్లకు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేశారు. మరికొందరికి సిహెచ్సి లకు తరలించి నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. ఇందులో చాలామంది 40 శాతం వైకల్యం కంటే తక్కువ ఉన్నవారు ఉన్నారు. మరి కొందరు ఎటువంటి వైకల్యం లేకుండానే.. పింఛన్లు తీసుకున్నట్లు స్పష్టమైంది. అందుకే వారందరికీ నోటీసులు అందించారు. వారి వైకల్య నిర్ధారణకు అవకాశం కూడా ఇచ్చారు. వాస్తవానికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు.. వివిధ కేటగిరీల కిందకు మారవచ్చు. 60 సంవత్సరాల పైబడిన వారు, వితంతువులు ఉంటే.. వారికి దివ్యాంగుల నుంచి మార్చుతారు.

* వ్యతిరేక ప్రచారం..
అయితే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తొలగింపు పై పెద్ద ఎత్తున విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వైకల్య నిర్ధారణకు సంబంధించి ఇచ్చిన నోటీసుల విషయంలో స్పష్టతనిచ్చింది. కేవలం అనర్హులను గుర్తించే ప్రక్రియలో భాగంగానే నోటీసులు ఇచ్చామని.. ఇందులో మరో ఉద్దేశానికి తావు లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పింఛన్లు వస్తాయని ప్రకటన జారీ చేసింది. అయితే కేవలం అపీల్ చేసుకునే వారికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version