KTR self-defense: కేటీఆర్.. పరిచయం అక్కరలేని నేత. తెలంగాణలో పదేళ్లు ముఖ్యమైన మంత్రిగా అధికారం చెలాయించారు. 2023 ప్రారంభంలో సీఎం పీఠంపైనా కన్నేశారు. తన మద్దతుదారుతో ప్రచారం చేయించారు. దీంతో పార్టీలో వ్యతిరేకతలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అందరినీ సైలెంట్ చేశారు. దీంతో తృటిలో సీఎం అయ్యే ఛాన్స్ మిస్ అయింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. అయితే తాజాగా కేటీఆర్‌లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంతకాలం అరెస్టు చేసుకోండి.. జైల్లో పెట్టండి.. ఆర్నెళ్లు ఉండి వస్తా అంటూ బీరాలు పలికిన మాజీ ముఖ్యమైన మంత్రి ఇప్పుడు తనను అరెస్టు చేయబోతున్నారు అంటూ సంకేతాలు ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు దూరం చేయాలని చూస్తున్నారని సానూభూతి ప్రయత్నం మొదలు పెట్టారు.
బెదిరించే శక్తులకు భయం లేదు
మాజీ మంత్రి కేటీఆర్ తనపై జరుగుతున్న బెదిరింపులను ఎదిరించి, ఎటువంటి భయానికి లొంగనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ప్రత్యర్థుల్లో ఆందోళనను రేకెత్తించాయి. ఇది ఆయన రాజకీయ ధైర్యాన్ని మరింత ప్రదర్శించే సందర్భంగా మారింది. అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ స్ట్రాటజీ మార్చినట్లు తెలుస్తోంది. సీహెచ్ఎంసీలో పట్టు సడలినట్లు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓటర్లను తనవైపు తిప్పుకునేందకు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల వ్యూహమా..
కేటీఆర్ పార్టీ సంస్థాగత బలాన్ని హైలైట్ చేస్తూ, ఒక వ్యక్తి లేకపోతే కూడా బీఆర్ఎస్ ఎదుగుతుందని తెలిపారు. ఇది పార్టీలో క్రమశిక్షణ, కార్యకర్తల విశ్వాసాన్ని పెంచుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు వ్యూహంలో భాగమే అన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ విస్తరణ పెరిగింది. 300 డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో పట్టు పెంచుకోవడంతోపాటు.. కొత్తగా విలీనం అయిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపడేలా.. నేతల్లో జోష్ తెచ్చేలా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు భావిస్తున్నారు.
ఏది ఏమైనా కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. అధికార పార్టీలో ఆందోళన పెరిగింది, బీఆర్ఎస్ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది ఎన్నికల ఫలితాలు, పార్టీ వ్యూహాలపై ఈ సంఘటన ప్రభావం చూపవచ్చు. కేటీఆర్ రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.