Homeఆంధ్రప్రదేశ్‌2025 Pawan Kalyan Roundup: 2025 రౌండప్: పార్ట్ టైం పొలిటీషియన్ కాదు.. పరిణితి కలిగిన...

2025 Pawan Kalyan Roundup: 2025 రౌండప్: పార్ట్ టైం పొలిటీషియన్ కాదు.. పరిణితి కలిగిన నేతగా పవన్!

2025 Pawan Kalyan Roundup: 2024 ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan ) ఒక ఫెయిల్యూర్ నేత. నాన్ సీరియస్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్. ఇలా ఎన్నెన్నో మాటలు, అవమానాలు తట్టుకొని ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. జనసేన ను శత శాతం విజయంతో దేశం యావత్తు తన వైపు చూసుకునేలా చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ స్థిరంగా ఉండరని.. చంద్రబాబు నాయకత్వాన్ని విభేదిస్తారని రాజకీయ ప్రత్యర్థుల తో పాటు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ వాటన్నింటిని అధిగమించి 2025లో మరింత పదునెక్కారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు నమ్మదగిన మిత్రుడిగా.. బిజెపికి అమ్ములపొదిలో ఉన్న అస్త్రంగా మారారు పవన్ కళ్యాణ్. కనీస పాలన అనుభవం లేని పవన్ కళ్యాణ్.. గ్రామీణ నేపథ్యం ఉన్న పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ శాఖలను ఎంచుకున్నారు. ఆ శాఖల్లో పరకాయ ప్రవేశం చేశారు. ఆ శాఖల ప్రగతిని పరుగు పెట్టించారు.

ఆకట్టుకునే పాలన..
గత ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ పల్లె పండుగ( Palle panduga ) నుంచి మొదలు పెడితే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల ఆట కట్టు చేసే వరకు.. నేరుగా చేసిన పర్యటనలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమీక్షలకే పరిమితం అయిన పవన్ కళ్యాణ్.. తరువాత క్షేత్రస్థాయిలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడకు ప్రభుత్వ యంత్రాంగం కదులుతూ వచ్చింది. చివరకు క్యాబినెట్లో ఆయన ప్రశ్నిస్తే నిర్ణయాలు సైతం మారుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతున్నారో అర్థమవుతోంది. అయితే పవన్ పనితీరును, ఆయన గ్రాఫ్ ను పెంచింది మాత్రం 2025.

సమన్వయ పాత్రలో..
ఏపీలో కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానంలో నిలుస్తూనే.. కూటమి లోపల సమన్వయ పాత్రను పోషిస్తున్నారు. చంద్రబాబుతో ఆయన బంధం రాజకీయ సహకారాన్ని దాటి వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ఇటీవల బీహార్ మినహా అనేక రాష్ట్ర ఎన్నికల్లో బిజెపి ప్రచారంలో పవన్ కీలకంగా వ్యవహరించారు. జాతీయస్థాయిలో ఎన్నికలు ఎక్కడ జరిగిన పవన్ కళ్యాణ్ కు కేంద్ర పెద్దలు ఆహ్వానిస్తున్నారంటే.. ఆయన గ్రాఫ్ ఎలా ఎదిగిందో అర్థం అవుతోంది. ఒకప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించిన వారే పవన్ నిర్ణయాలను, చర్యలను ఆహ్వానిస్తున్నారు.

వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం..
డిప్యూటీ సీఎం గా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్నప్పటికీ పాలనా వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం, పరిశీలించే శక్తి, దిద్దుబాటు చేసే తీరు.. పవన్ రాజకీయ వ్యక్తిత్వాన్ని మరింత పునాది చేస్తున్నాయి. ఈ ఏడాది కాలంలోనే నాయకత్వ పరిపక్వత, ప్రజా అనుసంధానం, కూటమి నిర్వహణ, పాలనా స్పష్టత.. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసాయి. నిలకడలేమి అనే విమర్శను తిప్పికొట్టేలా చేశాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular